పచ్చని కాపురాల్లో అనుమానం చేరి కుటుంబాలను నాశనం చేస్తోంది. దీని కారణంగా ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డా సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే..కర్నూలు జిల్లా ఆలమూరుకు చెందిన ఈరమ్మ, తిరుపాల్ అనే భార్యాభర్తలకు 20 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది. కొన్నాళ్ల పాటు వీరి దాంపత్య జీవితం హాయిగా సాగిపోయింది.
కానీ భర్త తిరుపాల్ మాత్రం అనేక కేసుల్లో ఇరుక్కుని పోలీసుల చుట్టు తిరుగుతూ ఉండేవాడు. ఇక ఒక కేసులో తిరుపాల్ ఏకంగా జైలు కెళ్ల్లాల్సి వచ్చింది. దీంతో ఈరమ్మ భర్త లేక ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. ఇక ఆమె జీవితం కొన్పి రోజుల పాటు అలాగే సాగింది. ఇక భర్త లేకపోవటంతో ఈరమ్మ పాణ్యం చెంచు కాలనీకి చెందిన శ్రీరాములతో స్నేహం ఏర్పరుచుకుంది. ఆ స్నేహం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లు పాటు వీరు చికటి సంసారాన్ని నడిపిస్తూనే ఉన్నారు.
తేనే సేకరణతో జీవనం సాగించే వీళ్లిద్దరూ ప్రతీ రోజు అడవిలోకి వెళ్లేవారు. ఇక కొన్నాళ్లకు ఈరమ్మ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానం శ్రీరాములుకు తలేత్తింది. దీంతో ఒక రోజు ఇదే విషయంపై అడవిలో శ్రీరాములు ఈరమ్మను నిలదీసి అడిగాడు. నేను అలాంటిదాన్ని కాదని, నవ్వంటేనే నాకు ఇష్టమని చెప్పింది. అయినా ఎంతకు వినని శ్రీరాములు పదే పదే అడుగుతూ ఈరమ్మను విసిగించాడు. దీంతో ప్రతీసారి అదే సమాధానం చెప్పటంతో శ్రీరాములు కోపోద్రిక్తుడయ్యాడు.
ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి కొట్టుకుని స్థాయికి చేరుకుంది. శ్రీరాములు కోపాన్ని ఆపుకోలేక పక్కనున్న పెద్ద కర్రతో ఈరమ్మ తలపై బలంగా బాదాడు. దీంతో అక్కడికక్కడే పడి రక్తపు మడుగులో పడి తన ప్రాణాలను విడిచింది. ఈ సమాచారం పోలీసుల వరకు వెళ్లింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు శ్రీరాములును అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచనంగా మారింది.