Crime News: ఆడపిల్లలంటే ఇష్టంలేని ఓ వ్యక్తి కన్నకూతుర్ని బలిచ్చాడు. నిత్యం మాంత్రికులతో తిరిగే అతను ఇంట్లోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన బిహార్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్, సీతామహ్రి జిల్లా పరౌలియా తోలా గ్రామానికి చెందిన ఇందల్ మహతోకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అతడికి ఆడ పిల్లలంటే ఇష్టంలేదు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం ఇందల్ చిన్న కూతురు కనిపించకుండా పోయింది. ఈ వార్త దావాలనంలా ఊరంతా వ్యాపించింది. రెండు రోజుల తర్వాత బాలిక మృతదేహం కాల్చిన స్థితిలో ఊరి బయట కనిపించింది. గ్రామస్తులు ఇందల్‌పై అనుమానం వ్యక్తం చేశారు. ఇందల్ ఎప్పుడూ మాంత్రికులతో తిరుగుతుంటాడు. పైగా కనిపించకుండా పోయింది స్వయంగా అతడి కూతురు.
ఈ కారణాలతో వారు ఇందల్ ఇంటిపైకి వెళ్లారు. అక్కడ నేలమీద రక్తపు మరకలు ఉండటం గమనించారు. ఆ వెంటనే అతడ్ని కొట్టి, తాళ్లతో కట్టిపడేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు. అతడి భార్యను కూడా విచారించారు. పోలీసుల విచారణలో భర్త గురించి ఆమె పలు షాకింగ్ విషయాలు చెప్పింది. తన భర్తకు ఆడపిల్లలంటే ఇష్టం లేదని, తమ పెళ్లి గురించి కూడా ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడని చెప్పింది. తమ కూతుళ్లను చంపుతానంటూ ఎప్పుడూ అరుస్తూ ఉండేవాడని తెలిపింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : NTR District: భర్తను కాదని ప్రియుడికి జై కొట్టిన భార్య.. చివరికి జరిగింది ఇదే!