కారు కొనడం అనేది చాలా మందికి ఒక కల. నగరంలో నలుగురు వ్యక్తులు ఉన్న ఒక కుటుంబానికి కారు అనేది విలాసం కాకుండా.. అవసరంగా మారిపోయింది. కొత్తకారు కొనాలి అనుకునే వారికి మాత్రం ఇదే సరైన సమయంగా చెప్పవచ్చు. ఎందుకంటే టాటా మోటార్స్ ఇప్పుడు అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది.
కారు కొనడం అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కలగా ఉంటుంది. గతంలో అంటే కారు అనేది విలాసం గానీ.. ఇప్పుడైతే నలుగురు ఉండే ఇంట్లో కారు అవసరం కిందకే వస్తుంది. ఎక్కడికి వెల్లాలన్నా బస్, ఆటో, క్యాబ్ అంటూ చాలానే ఖర్చు అవుతుంది. అయితే కారు కొనడం అంత చిన్న విషయం ఏమీ కాదు. అందుకు సేవింగ్స్ మాత్రమే కాదు.. మంచి డిస్కౌంట్స్ కూడా ఉండాలి. అందుకే కొత్త కారు కొనాలి అనుకునే వారికి ఇదే బెస్ట్ టైమ్ అని చెప్పచ్చు. ఎందుకంటే టాటా కార్లపై ఇప్పుడు మంచి డిస్కౌంట్స్ ప్రకటించారు. అంతేకాకుండా సేఫ్టీ విషయంలో టాటా కార్లు బెస్ట్ అని అందరికీ తెలిసిందే. 2022-23లో విడుదలైన ఆల్ట్రోజ్- హారియర్- సఫారీ మోడల్స్ పై ఈ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. మరి.. ఎంత డిస్కౌంట్స్ లభిస్తున్నాయో చూద్దాం.
2023 టాటా అల్ట్రోజ్ పెట్రోల్- డీజిల్, ఆటేమోటిక్ వర్షన్స్ పై మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. ఈ ప్రీమియం హ్యాట్చ్ బ్యాక్ పెట్రోల్- డీజిల్ వేరియంట్ పై రూ.25 వేలు వరకు డిస్కౌంట్స్ ఇస్తున్నారు. ఆటోమేటి వర్సన్ పై కూడా రూ.25 వేలు డిస్కౌంట్ లభిస్తోంది. 2022 ఏడాదికి చెందిన టాటా ఆల్ట్రోజ్ పై అయితే.. పెట్రోలు వేరియంట్ పై రూ.20 వేలు, డీజిల్ వేరియంట్ పై రూ.35 వేలు దాకా డిస్కౌంట్స్ ఇస్తున్నారు. 2022 ఏడాదిలో తయారైన పెట్రోల్ డీసీఏ ఆటోమేటిక్ వర్షన్ పై అయితే రూ.30 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
టాటా మోటార్స్ సంస్థ 2022కి చెందిన టియాగో స్టాక్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్చేస్తోంది. అప్పటి స్టాక్ అయితే రూ.40 వేలు వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. అదే లేటెస్ట్ టియాగో సీఎన్జీ హ్యాచ్ బ్యాక్ మోడల్ పై అయితే మీకు రూ.30 వేలు డిస్కౌంట్ ని అందిస్తున్నారు. పెట్రోల్ వేరియంట్ పై రూ.25 వేలు డిస్కౌంట్ లభిస్తోంది. మార్కెట్ లో ఉన్న స్విఫ్ట్, ఇగ్నిస్, గ్రాండ్ ఐ10 వంటి మోడల్స్ కు ఈ టాటా టియాగో బెటర్ రీప్లెస్ గా భావిస్తుంటారు.
టాటా హారియర్ అనేది టాటా మోటార్స్ నుంచి లభిస్తున్న మంచి ప్రీమియం మోడల్. ఈ నెలలో అయితే హారియర్ పై రూ.35 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. రూ.10 వేలు క్యాష్ డిస్కౌట్ ఇవ్వనుండగా.. రూ.25 వేల వరకు ఎక్సేంఛేంజ్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అదే 2022 స్టాక్ మీద అయితే వేరియంట్ ని బట్టి గరిష్టంగా రూ.65 వేల వరకు మీకు ఈ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. SUV సెగ్మెంట్ లో టాటా హారియర్ చాలా ప్రీమియం కార్లకు ప్రత్యామ్నాయంగా మారుతోంది.
టాటా సఫారీ మోడల్ 2022 స్టాక్ మీద అయితే.. గరిష్టంగా రూ.65 వేలు వరకు డిస్కౌంట్స్ ఇస్తున్నారు. అదే 2023 వేరియంట్ అయితే రూ.35 వేలు డిస్కౌంట్స్, రూ.10 వేలు క్యాష్ డిస్కౌంట్, రూ.25 వేలు ఎక్స్ ఛేంజ్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. అంటే 2023 సఫారీ మోడల్ పై గరిష్టంగా రూ.60 వేల వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. సేఫ్టీ పరంగా టాటా కార్స్ కి ఎంతో మంచి గుర్తింపు ఉంది. అంతేకాకుండా ప్రతి రేంజ్ లో అద్భుతమైన మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.