కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను, పథకాలను ప్రారంభించి.. అమలు చేస్తోంది. అయితే వీటిపై చాలా మందికి అవగాహన ఉండదు. కొందరు మాత్రమే పథకాల వివరాలను తెలుసుకుని.. ఆ ప్రయోజనాలను పొందుతుంటారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల తో పాటు వ్యాపారస్తులకు కూడా పలు స్కీమ్స్ అందిస్తోంది. ఇటీవల కాలంలో చిన్న వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను తీసుకొచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన ఓ స్కీమ్ చిన్న వ్యాపారులకు చిటికెలో రుణాలు వచ్చేలా చేస్తుంది. అదే “పీఎం స్వా నిధి పథకం”. మరి.. ఈ స్కీమ్ పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి జనజీవనాన్ని అల్లకల్లోలం చేసింది. ఈ కోవిడ్ కారణంగా లక్షలాది మంది చనిపోయారు. చాలా మంది అనాథలుగా మిగిలిపోవడంతో పాటు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. చాలా మంది వ్యాపారులు ఆర్ధికంగా దెబ్బతిన్నారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడింది. కోవిడ్ మహమ్మారి కారణంగా కోలుకోలేని విధంగా చిరు వ్యాపారులు నష్టపోయారు. ఇంకా దారుణం ఏమిటంటే.. ఇప్పటికి చాలా మంది చిరు వ్యాపారులు కోవిడ్ కారణంగా జరిగిన నష్టం నుంచి తేరుకోలేదు. ఇలాంటి వారిని ఆదుకునేందుకే కేంద్ర ప్రభుత్వం ‘పీఎమ్ స్వా నిధి పథకం’ ప్రారంభించింది. అయితే దీనిపై అవగాహన లేక చాలామంది ఉపయోగించుకోవడం లేదు. ఆ పథకం ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నారు. ఈ పథకం కింద చిరు వ్యాపారులకు రూ.10 వేల నుంచి రూ.50 వరకు రుణాలు పొందవచ్చు.
ఇక ఎకనామిక్స్ టైమ్స్ కథనం ప్రకారం.. ప్రస్తుతం ఇచ్చే ప్రారంభ రుణం రూ.10 వేలను రూ.20 వేలకు పెంచాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విషయంపై కేంద్రానికి, బ్యాంకుల మధ్య తరచూ సమావేశాలు జరుగుతున్నాయి. 2020 సంవత్సరంలో వివిధ బ్యాంకులు దాదాపు 20 లక్షల మందికి రుణాలు మంజురూ చేశారు. అదే విధంగా 2021లో ఈ పథకం ద్వారా 9 లక్షల మంది రుణాలు పొందారు. పీఎం స్వానిధి యోజన స్కీమ్ ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేయడానికి, ఎలాంటి గ్యారెంటీ అవసరం లేదు. ఎందుకంటే.. దీని ముఖ్య ఉద్దేశ్యం చిరు వ్యాపారులకు ఆర్థికంగా చేయుత అందించడమే. ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకున్న చిరు వ్యాపారికి మొదటి ఏడాది రూ.10 వేలు ఇస్తారు. అవి సకాలంలో చెల్లిస్తే.. రెండో సారి రూ.20 వేలు రుణం తీసుకోవచ్చు. ఇలా సకాలంలో చెల్లిస్తుంటే.. ఎలాంటి పూచికత్తు లేకుండా మూడోసారి రూ.50 వేలు రుణంగా పొందే అవకాశం ఉంది. ఈ లోన్ పై ఏడు శాతం వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది. మీ నెలవారీ చెల్లింపులను ఆన్ లైన్ ద్వారా కూడ చెల్లించవచ్చు. కొన్ని సమయాల్లో వడ్డీపై రాయితీ కూడా ఇస్తారు.
ఇలా దరఖాస్తు ను పూర్తిగా నింపిన తరువాత సబ్మిట్ బటన్ పై ఒకే చేయాలి. ఆ తరువాత బ్యాంకు నియమాల ప్రకారం మీ దరఖాస్తు పరిశీలన జరుగుతుంది. ఆపై మీ దరఖాస్తును ఆమోదించి నగదును మీ ఖాతా కు జమ చేస్తారు.