మీరు ఈ మధ్య టూ వీలర్ తీసుకోవాలని అనుకుంటున్నారా? తక్కువ ధరలో లభ్యమయ్యే బైక్ లకోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీలాంటి వారికోసం హెచ్ఎఫ్ డీలక్స్ కిక్ స్టార్ట్ మోడల్ బైక్ పై ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అదిరిపోయే ఆఫర్ ను తీసుకొచ్చింది.
టూ వీలర్ల తయారీలో రారాజైన హీరో మోటో కార్ప్ ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ తో బైక్ లను ఆవిష్కరిస్తూ మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉంటుంది. వాహనదారులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా ఆధునిక ఫీచర్లను జోడించి బైక్ లను తయారు చేస్తుంది హీరో కంపెనీ. ఈ రోజల్లో టూ వీలర్స్ వాడకం ఎక్కువైపోయింది. ఉద్యోగస్తులు, చిరు వ్యాపారులు, కాలేజ్ స్టూడెంట్స్ మొదలుకొని వివిధ వర్గాల వారు బైక్ లను కొనుగోలు చేస్తున్నారు. ఈ మధ్య బైక్ ట్యాక్సీలు, ఫుడ్ డెలివరీ సంస్థలు అందుబాటులోకి వచ్చాక బైక్ లను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగింది. అవసరం ఏదైనా సరే తక్కువ బడ్జెట్ లో బైక్ కొనాలనుకునే వారికి హీరో మోటోకార్ప్ కళ్లు చెదిరే ఆఫర్ తీసుకొచ్చింది. తక్కువ ధరకే హీరో బైక్ ను సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. ఆ వివరాలేంటో ఇప్పడు చూద్దాం.
జాతీయ, అంతర్జాతీయంగా ఆటోమొబైల్ రంగంలో చిప్స్, విడిభాగాల కొరత ఉండడంతో కొంత కాలంగా వాహనాల ధరలు పెరుగుతున్నాయి. ఈ కారణంగా సామాన్యులు బైక్ లను కొనుగోలు చేయడానికి ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో హీరో కంపెనీకి చెందిన హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ కిక్ స్టార్ట్ మోడల్ పై ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. కేవలం రూ. 57 వేలకే కొత్త బైక్ ను సొంతం చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఆఫర్లను వినియోగించుకుని తక్కువ ధరకే హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ ను ఎలా పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందా. ప్రస్తుతం హెచ్ఎఫ్ డీలక్స్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 62, 862గా ఉంది. అయితే ఆఫర్ల ద్వారా ఈ బైక్ పై రూ. 5500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ప్రీపేయిడ్ ఆఫర్ కింద రూ. 4000, యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఆఫర్లు వినియోగించుకుని హెచ్ఎఫ్ డీలక్స్ కొత్త బైక్ ను రూ. 57,362 కే దక్కించుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ కావాలనుకునే వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫ్లిప్ కార్ట్ ద్వారా హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ ను సొంతం చేసుకోండి.