కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? ఐతే వెంటనే కొనేయండి.. లేదంటే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. ఎందుకు..? ఏంటి..? అనుకుంటున్నారా! ధరలు పెరగనున్నాయి.
కొత్త బైక్ కొనాలనే ఆలోచన ఉన్నవారు వెంటనే ఆ పని చేసేయండి.. లేదంటే ఆర్థికంగా మరింత నష్టపోక తప్పరు. అందుకు ప్రధాన కారణం.. ధరల పెరుగుదలే. కోవిడ్ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సామాన్య ప్రజలకు ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటాకార్ప్ పిడుగులాంటి వార్త చెప్పింది. తమ బైక్స్ ధరలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. ఒక్కో మోడల్‌పై కనీసం 2 శాతం ధరలను పెంచుతున్నట్లుగా తాజాగా ప్రకటించింది. ఈ పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.
బైక్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన హీరో మోటాకార్ప్.. కర్బన ఉద్గార నిబంధనల వ్యయం కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. బీఎస్-6 ఫేజ్-2 కర్బన ఉద్గారాల నిబంధనలు పాటించడంలో భాగంగా ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిపోతోందని, అందుకే వాహనాల ధరలు పెంచే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ పెంపు అనేది మోడల్ మార్కెట్‌ను బట్టి ఆయా ప్రాంతాల వారీగా ఉంటుందని సంస్థ చెప్పింది. అయితే, కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హీరో మోటో కార్పు అధునాతన ఫైనాన్షింగ్ సొల్యూషన్స్‌ను కొనసాగిస్తూనే ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో హీరో బైక్ కొనాలనే ఆలోచన ఉన్నవారు వెంటనే కొనుగోలు చేయడం మంచిది. ఏప్రిల్ 1 తర్వాత హీరో వాహనాలు మరింత ప్రియం కానున్నాయి.
కాగా, గతేడాది డిసెంబర్‌లో కూడా హీరో తన వాహన ధరలను పెంచింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త వాహన నిబంధనల ప్రకారం.. కంపెనీలన్నీ కొత్త ఉద్గార ప్రమాణాలను అందుకునేందుకు తమ వాహనాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నాయి. ఈ సరికొత్త మార్పులతో వాహనాలు ఎప్పటికప్పుడు ఎంతెంత ఉద్గారాలు విడుదల చేస్తున్నాయో తెలుసుకోవచ్చు. ఇలా ఉద్గార నిబంధనలు కఠినంగా పాటించడం వల్లనే వాహనాల ధరలను పెంచాల్సి వచ్చిందని హీరో మోటాకార్ప్ చెబుతోంది. ఐతే, హీరో ఎలక్ట్రిక్ వాహనాలపై ఈ పెంపు ఉంటుందా..? లేదా..? అన్న దానిపై స్పష్టత లేదు. కోవిడ్ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సామాన్య ప్రజలపై.. ఈ ధరల పెంపు ఎంత మేర ప్రభావం చూపుతుందో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Hero MotoCorp will increase the ex-showroom prices of some of its motorcycles and scooters starting from April 1, 2023. Price hike is said to be around 2% and is primarily due to the transition to OBD 2 (On-Board Diagnostics) regulations, which have caused an increase in (1/3) https://t.co/uoamIYJ26y pic.twitter.com/ncPP9NVymo
— Arka Bhattacharjee (@niveyshak) March 23, 2023