మీరు కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా..? ఏ బైక్ తీసుకోవాలో అర్థమవ్వడం లేదా! అయితే ఈ కథనం చదివేయండి. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇస్తున్న బైకుల వివరాలు మీకందిస్తున్నాం.. వీటిలో మీకు నచ్చిందేదో తెలుసుకొని ఓకే అవగాహనకు రావచ్చు.
ప్రస్తుతం బైక్ ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. బైక్ కొనాలనే ఆలోచననే దూరం చేస్తున్నాయి. దాదాపు అన్ని బైకుల ధర లక్షకు పైనే ఉంటోంది. ఇక ప్రీమియం బైకుల గురించి అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవంగా చెప్పాలంటే.. ఈరోజుల్లో బైక్ కొనడం కంటే సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కోవడం నయం. ఆ రేంజులో ధరలున్నాయి. పోనీ, అంత పెట్టి కొన్నా వచ్చేది అరకొర మైలేజీనే. ఈ నేపథ్యంలో తక్కువ ధర వెచ్చించి.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులను కొనుగోలు చేయటం ఉత్తమం. అలాంటి బైకుల వివరాలను మీకందిస్తున్నాం.. ఓ లుక్కేయండి.
మార్కెట్ లోకి ఎన్ని బైకులోచ్చినా.. హీరో మోటోకార్ప్, హోండా, టీవీఎస్ బజాబ్ లకు మరేవి సాటి రావు. ఈ కంపెనీల బైకులు తక్కువ ధరకు అందబాటులో ఉండటమే కాదు.. మైలేజ్ పరంగా సామాన్యుడిగా కాస్త ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయి. అందులో చెప్పుకోదగ్గవి.. హీరో మోటోకార్ప్ గ్లామర్, హెండా షైన్, బజాజ్ సిటీ100, టీవీఎస్ స్పోర్ట్, టీవీఎస్ రైడర్. ఈ బైకులు ప్రస్తుతం లక్ష రూపాయల లోపే అందుబాటులో ఉన్నాయి. వీటి ధర, మైలేజ్ వివరాలు తెలుసుకొని మీకు నచ్చింది కొనేయండి..
ఈ జాబితాలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది హీరో గ్లామర్ గురుంచి. అద్భుతమైన ఇంజన్ పనితీరు చూపిస్తున్న ఈ బైక్ లక్షకు అందుబాటులో ఉంది. 124.5 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ తో ఈ బైక్ పని చేస్తుంది. లీటర్ కు 55 kmpl మైలేజీని అందిస్తుంది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. సెల్ఫ్-స్టార్ట్ డ్రమ్ వేరియంట్ ధర రూ.78768కాగా, సెల్ఫ్-స్టార్ట్ డిస్క్ వేరియంట్ ధర రూ.82768 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
దేశంలో అత్యంత విశ్వసనీయ బైక్‌లలో హోండా ‘షైన్’ ఒకటి. ఇది రోజువారీ వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది. హోండా షైన్ లో 123.94 సీసీ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది 55 kmpl వరకు మైలేజీని అందిస్తుంది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో డ్రమ్ వేరియంట్ ధర రూ.78687కాగా, డిస్క్ వేరియంట్ ధర రూ.82697 ఎక్స్-షోరూమ్ ధరలతో అందుబాటులో ఉంది.
బజాజ్ కంపెనీ బైకులు అంటే.. ప్లాటినా తర్వాత, ‘సిటీ 100’ గురుంచే చెప్పుకోవాలి. ఇందులో 115.4 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు. 75 kmpl మైలేజీని అందిస్తుంది. ఇది రూ.72224 ఎక్స్-షోరూమ్ ధర వద్ద అందుబాటులో ఉంది.
టీవీఎస్ బైకులు కూడా మైలేజ్ పరంగా చెప్పుకోదగ్గవే. ముఖ్యంగా టీవీఎస్ స్పోర్ట్ కొనుగోలు చేయొచ్చు. సెల్ఫ్ స్టార్ట్, కిక్ స్టార్ట్ అను రెండు ఈ బైక్ అందుబాటులో ఉంది. ఇందులో 109.7 సీసీ ఇంజిన్ కలదు. 75 kmpl మైలేజీని అందిస్తుంది. దీని ధర రూ.64050 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
చివరగా చెప్పుకోవాల్సింది.. టీవీఎస్ రైడర్. ఇటీవల కాలంలో ఈ బైకులకు బాగా ఆదరణ పెరుగుతోంది. చూడడానికి స్పోర్ట్స్ లుక్ లో ఉండటంతో పాటు తక్కువ బరువుండటం దీని ప్రత్యేకత. ఒకరకంగా చెప్పాలంటే.. విలాసవంతమైన బైక్. బ్లూటూత్ కనెక్టివిటీ, పూర్తి డిజిటల్ స్క్రీన్‌తో సహా డజన్ల కొద్దీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇక ధర విషయానికొస్తే.. రూ. 93719 ఎక్స్-షోరూమ్ ధర వద్ద అందుబాటులో ఉంది.