భవిష్యత్తు బాగుండాలనుకునేవారు డబ్బుని వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. కొందరు భూమ్మీద పెడతారు. కొందరు బంగారం మీద పెడతారు. కొందరు మ్యూచువల్ ఫండ్స్ లో పెడతారు. అయితే మీకు తెలుసా.. మ్యూచువల్ ఫండ్స్ లో తక్కువ మొత్తంలో అంటే నెలకు కేవలం రూ. 500 పెట్టుబడి పెడుతూ కూడా మెచ్యూరిటీ సమయంలో రూ. 35 లక్షలు రాబడి పొందవచ్చు.
డబ్బు సంపాదించాలంటే పెట్టుబడి ఒకటే మార్గం. ఏదో ఒక దాంట్లో పెట్టుబడి పెడితేనే ఆ డబ్బు మరింత డబ్బుని సంపాదించి పెడుతుంది. డబ్బున్న వాళ్ళు పాటించే సూత్రం ఇదే. లాభాలు వచ్చే దాంట్లో పెట్టుబడులు పెడతారు. భారీగా లాభాలను పొందుతారు. పెట్టుబడి అంటే మరీ వేలు, లక్షలు అవసరం లేదు. జస్ట్ వందలు ఉన్నా చాలు. ఆ వందలు పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్లినా ఒకరోజున ఆ మొత్తం కొన్ని లక్షలు అవుతాయి. ఈరోజుల్లో చాలా మంది ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. భవిష్యత్తులో తమ కలలు నెరవేర్చుకోవడం కోసమో లేదా తమ పిల్లల భవిష్యత్తు కోసమో నెలకు కొంత సొమ్ము పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తున్నారు. సరైన ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ లో పెట్టుబడి పెడితే ఖచ్చితంగా లాభాలను పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
షార్ట్ పీరియడ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అనేవి ఎక్కువ రిస్క్ కలిగి ఉంటాయి. రాబడి కూడా తక్కువ ఉంటుంది. అదే లాంగ్ పీరియడ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అనేవి రిస్క్ ఉంటుంది. కానీ రాబడి ఎక్కువగా ఉంటుంది. నాకంత ఓపిక లేదు, రెండు, మూడేళ్ళలో లక్షలు వచ్చేయాలి అంటే అవ్వదు. లక్షలు కావాలంటే వ్యాపారం చేయాలి. దానికి మళ్ళీ వేలల్లో, లక్షల్లో పెట్టుబడి కావాలి. మన దగ్గరున్న చిన్న మొత్తంతో సుదీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే.. ఒక వయసు వచ్చాక పెద్ద మొత్తంలో అమౌంట్ మన చేతిలో ఉంటుంది. అది జరగాలంటే చాలా ఓపిక కావాలి. జింకను వేటాడాలంటే పులి ఎంత ఓపిగ్గా ఉంటుంది. అలాంటిది పులినే వేటాడాలంటే మనం ఎంత ఓపిగ్గా ఉండాలి. నెలకు రూ. 500 చొప్పున పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే.. కొన్నేళ్ల తర్వాత 35 లక్షలు రాబడి వస్తుంది. మార్కెట్లో ప్రస్తుతం అనేక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు ఉన్నాయి. ఎంచుకునే ఆప్షన్ బట్టి రాబడి అనేది నిర్ణయించబడుతుంది.
మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో సగటున 12 శాతం రాబడి పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు. మీరు పెట్టుబడి పెట్టిన ఫండ్ మెరుగైన పనితీరు కనబరిస్తే 15 శాతం రాబడి ఉంటుంది. నెలకు తక్కువలో తక్కువ రూ. 500 పెట్టుబడి పెట్టాలని మీరు అనుకుంటే.. భవిష్యత్తులో మీ చేతిలో రూ. 35 లక్షలు ఉంటాయి. ఒక 30 ఏళ్ళు నెలకు రూ. 500 చొప్పున మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే.. 30 ఏళ్ల తర్వాత మీ చేతికి రూ. 35 లక్షలు వస్తాయి. మీరు పెట్టుబడి పెట్టింది కేవలం రూ. 1,80,000 అయితే మీ చేతికి వచ్చేది రూ. 35,04,910. రేట్ ఆఫ్ రిటర్న్ 12 శాతం అనుకుంటే మీ చేతికి 30 ఏళ్ల తర్వాత 17 లక్షల 64 వేల 957 రూపాయలు వస్తాయి. 30 ఏళ్ళు మీవి కాదని, మీ పిల్లల జీవితం అనుకుని నెలకు రూ. 500 పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే భారీ మొత్తాన్ని పొందవచ్చు. అదే నెలకు వెయ్యి చొప్పున 30 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే.. మెచ్యూరిటీ సమయానికి మీ చేతికి రూ. 70 లక్షలు పైనే వస్తాయి.
అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ స్కీమ్స్ లో పెట్టుబడి పెట్టడం అనేది రిస్క్ తో కూడుకున్నది. ఖచ్చితమైన రాబడి ఉంటుందన్న గ్యారంటీ ఉండదు. స్టాక్ మార్కెట్ రిస్క్ కు లోబడి మ్యూచువల్ ఫండ్స్ రాబడి అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే ఇన్వెస్ట్ చేసే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఇన్వెస్ట్మెంట్ నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. మనకెందుకొచ్చిన రిస్క్ అనుకుంటే గనుక పోస్టాఫీస్, బ్యాంకుల్లో పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టచ్చు. రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. లేదు రిస్క్ అయినా పర్లేదు అనుకునేవారు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. మరి నెలకు రూ. 500 పెట్టుబడితో 35 లక్షలు పొందే ఇన్వెస్ట్మెంట్ స్కీంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.