బైక్ కొనాలనే ఆలోచనలో ఉన్నారా! రూ.లక్షలు వెచ్చించి కొత్త బైక్ కొనుగోలు చేసేంత డబ్బు మీ వద్ద లేదా? అయితే, సెకండ్ హ్యాండ్ బైక్ లపై ఓ లుక్కేయండి. అతి తక్కువ ధరకే వీటిని మీసొంతం చేసుకోవచ్చు.
ధనవంతులు కార్లకు ఎలాగో.. మధ్యతరగతి ప్రజలకు బైక్‌లు అలాగా. షికార్లకు వెళ్లాలన్నా, పొలం గట్లకు వెళ్లాలన్నా, మార్కెట్‌కు వెళ్లాలన్నా ఆఖరకు పిల్లలను స్కూల్ కు తీసుకెళ్లాలన్నా బైక్ కావాల్సిందే. కానీ, ప్రస్తుతం వాటి ధరలు సామాన్యుడికి బైక్ కొనాలనే ఆలోచననే దూరం చేస్తున్నాయి. బీఎస్ 6 వెహికల్స్ అందుబాటులోకి వచ్చిననాటి నుంచి బైక్ ధరలు రూ. 80 వేలపైనే. అదీ టీవీఎస్ వంటి లోబడ్జెట్ బైకులు. కొంచెం స్టయిల్ లుక్ ఉన్నవి కావాలంటే లక్ష రూపాయల పైమాటే. ఇలాంటి పరిస్థితులలో సెకండ్ హ్యాండ్ బైక్ కొని ఆర్థిక స్తోమతకు అనుగుణంగా సర్దుకుపోవడం ఎంతో మంచిది.
సెకండ్ హ్యాండ్ బైక్‌లను విక్రయించే ప్రముఖ ఆన్‌లైన్ సంస్థ ‘బైక్‌దేఖో(BikeDekho)లో అందుబాటులో ఉన్నటువంటి కొన్ని బైకుల వివరాలను మీకందిస్తున్నాం.. వీటిపై ఓ లుక్కేసి మీకు నచ్చింది సొంతం చేసుకోండి.
2016 మోడెల్ కు చెందిన హోండా యాక్టివా 3జిని ఒక యూజర్ బైక్ దేఖోలో అమ్మకానికి ఉంచారు. ఈ బైక్ ఇప్పటివరకు 30,000 కిలోమీటర్లు తిరిగినట్లు అతడు ప్రస్తావించాడు. ఈ బైక్ ధర రూ.25 వేలు. ఒక లీటరుకు 55 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందట. ఈ బైక్ చూడ్డానికి చాలా బాగుంది. ఒక్క గీత కూడా లేదు. మీకు నచ్చినట్లయితే.. ముందుగా ఇది నిజమైన ప్రకటనా..? కాదా..? అన్నది నిర్ధారించుకొని ముందుకు సాగండి.
సెకండ్ హ్యాండ్ బైక్‌లను విక్రయించే ప్రముఖ ఆన్ లైన్ సంస్థ ‘క్వికర్(Quikr)లో అందుబాటులో ఉన్నటువంటి కొన్ని బైకుల వివరాలను మీకందిస్తున్నాం.. వీటిపై ఓ లుక్కేసి మీకు నచ్చింది సొంతం చేసుకోండి.
2008 మోడల్ కు చెందిన ఈ బైక్ ధర రూ.25 వేలుగా ఉంది. ఇప్పటివరకు ఈ బైక్ 60,000 కిలోమీటర్ల దూర ప్రయాణించినట్లు యూజర్ అందులో పేర్కొన్నారు. 6 రోజుల క్రితం ఈ బైక్ ను అమ్మకానికి పెట్టారు. ఈ బైక్ ను ఒకసారి పరిశీలించవచ్చు.
కరిజ్మా బైక్ లవర్స్‌కు ఇదొక చక్కని అవకాశం. 2011 మోడల్‌కు చెందిన ఈ బైక్ రూ.25 వేల ధరకు అందుబాటులో ఉంది. ఇప్పటివరకు4,000 కిలోమీటర్ల దూర ప్రయాణించినట్లు యూజర్ అందులో పేర్కొన్నారు. ఇది వాస్తవం కాకపోవచ్చు. ఈ బైక్‌ను ఒకసారి పరిశీలించవచ్చు.
పల్సర్ బైక్ అంటే ఇష్టపడే వారు ఈ బైక్‌పై ఓ లుక్కేయండి. 2013 మోడెల్‌కు చెందిన ఈ బైక్ రూ.29,900 ధరకు అందుబాటులో ఉంది. ఈ బైక్ చూడడానికి బాగానే ఉంది. కొత్త బైక్ కొనాలనే మక్కువతో ఈ బైక్ అమ్మకానికి ఉంచినట్లు యూజర్ పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం ఈ బైక్‌ను అమ్మకానికి పెట్టారు. ఈ బైక్‌ను ఒకసారి పరిశీలించవచ్చు.