ఆయన ఏపీ కేబినెట్ లో కీలక మంత్రి.. సీఎం జగన్ కేబినెట్ లో రెండో సారి మంత్రి పదవి దక్కించుకున్నవారిలో ఆయన ఒకరు. నిత్యం ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తుంటారు. అలా తన పనులతో బిజిగా ఉన్న సమయంలో కూడా ఆత్మహత్యయత్నం చేసిన ఓ మహిళ, ఆమె పిల్లలకు వైద్యం చేసి కాపాడారు. ఆయనే పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు. వ్ళత్తిరీత్యా డాక్టర్ అయిన మంత్రి అప్పలరాజు.. ఆసుపత్రిలో అడుగుపెట్టగానే డాక్టర్ గా మారిపోయారు. పిల్లలను, తల్లి స్టెతస్కోప్ తో పరిశీలించి.. మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులకు ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే..
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన తులసీరావు, దంపతులు. వీరికి నక్షత్ర, ఆకాష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలం గా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. క్రమంలో ఆదివారం ఉదయం సెలూన్ కు వెళ్లిన తులసీ రావు తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి లోపల నుంచి గడియ పెట్టి ఉండటాన్ని గమనించాడు. అనుమానం వచ్చి గ్రామస్థుల సహకారంతో ఇంటి వెనుక భాగం నుంచి లోపలకు ప్రవేశించి చూడగా భార్య దీపతో పాటు ఇద్దరు పిల్లలు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే ఆటోలో వారిని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక వైద్యం చేశారు.విషయం తెలుసుకున్న మంత్రి అప్పలరాజు ఆసుపత్రికి చేరుకుని బాధితులను వైద్యం చేశాడు. అనంతరం వైద్య సిబ్బందికి సూచనలిచ్చారు. దీంతో స్థానికులు మంత్రి అప్పల రాజుపై ప్రశంసలు కురిపించారు. కుటుంబ కలహాలతో జీడి తోటకు కొట్టే పురుగుల మందు దీప తాగి, పిల్లలకు తాగించినట్లు స్థానికులు అంటున్నారు వైద్యుడిగా మారి ఆతల్లీబిడ్డలకు వైద్యం చేసిన ఈ మంత్రిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.