మహిళలను వేధిస్తే తాను చూస్తూ ఊరుకోనని మంత్రి సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో దిశ యాప్ డౌన్ లోడ్ డ్రైవ్ లో భాగంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సభకు మంత్రి సీదిరి అప్పలరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అప్పల రాజు మాట్లాడుతూ.. ” దిశ యాప్ కేవలం మహిళల వద్దనే కాదు, మెన్స్ మొబైల్ లో కూడా ఉండాలి. ఎవరైన మహిళలు బస్ స్టాండ్ లో ని బస్సుకోసం నిల్చుని ఉంటారు. ఎవరైన తుంటరోడు ఈవ్ టీజింగ్ చేస్తాడు. అలాంటి సమయంలో వెంటనే పోలీసులకు సమాచారం ఇందించాలంటే ఇంటర్ చదువుకున్న అమ్మాయి వద్ద అయితే మొబైల్ ఉండే అవకాశం లేదు. అలాంటి సందర్భంలో నాలాంటి అన్నయ్య పక్కన ఉండి.. నా మొబైల్ లో దిశ యాప్ ఉంటే..వాడికి అక్కడిక్కడే కోసి కారం పెటే అవకాశం ఉందని”అని తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి ధర్మాన ప్రసాదరావు, క్రీడాకారిణి నైనా జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు. మరి.. మంత్రి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.