బుధవారం చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజవర్గంలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతంగా మారింది. “ఇదేం ఖర్మ రాష్ట్రానికి” అనే కార్యక్రమంలో భాగంగా బుధవారం చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కుప్పం నియోజవర్గం సరిహద్దులోని పెద్దూరులో చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డు షోలు, సభలకు అనుమతి లేదంటూ పోలీసులు చంద్రబాబును అడ్డుకున్నారు. ఈక్రమంలోనే చంద్రబాబుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. తనకు అనుమతి ఇచ్చే వరకు అక్కడి నుంచి కదలని చంద్రబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం కుప్పంలో హై టెన్షన్ వాతారవణం ఏర్పడింది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు.
తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అనే కార్యక్రమం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇటీవలే కర్నూలు , విజయనగరం, నెల్లూరు, గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. అయితే ఆయన పాల్గొన్న కందుకూరు, గుంటూరు సభల్లో జరిగిన తొక్కిసలాటలో పలువురు మృత్యువాత పడ్డారు. ఈక్రమలోనే ప్రభుత్వం రోడు షోలకు, సభలకు అనుమతును నిరాకరిస్తూ జీవో జారీ చేసింది. ఇదే సమయంలో బుధవారం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గ పర్యటనకు వెళ్లారు. టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి.. చంద్రబాబుకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అయితే సభలకు, ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు పెద్దూరు వద్ద చంద్రబాబును అడ్డుకున్నారు.
పర్యటనకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు చంద్రబాబుకు వివరించారు. పలమేనేరు డీఎస్పీ సుధారక్ ,స్థానిక సీఐ చంద్రబాబుకు నోటీసు ఇచ్చే ప్రయత్నంచేశారు. పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వరని పోలీసులను ప్రశ్నించారు. చాలా సమయం పాటు చంద్రబాబు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలోనే కారులో నుంచి దిగి పాదయాత్ర సిద్దమయ్యారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఇలానే చేసి ఉంటే జగన్ పాదయాత్ర చేశావారా? అంటూ ప్రశ్నిచారు. తనను అనుమతించే వరకు అక్కడి నుంచి కదలని కారులోనే కూర్చున్నారు. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు.