ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా లేపాక్షి ఆలయం అరుదైన గుర్తింపు పొందేందుకు అడుగు దూరంలో నిలిచింది. యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. యునెస్కో విడుదల చేసిన వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో లేపాక్షికి చోటు లభించింది. యునెస్కో వారసత్వ జాబితోలోచోటు దక్కే అవకాశం మెండుగా కనిపిస్తోంది. అదే జరిగితే ఏపీ నుంచి యునెస్కోలో చోటు సంపాదించుకున్న తొలి ఆలయంగా చరిత్రలో నిలుస్తుంది.
ఇండియా నుంచి మొత్తం మూడు ప్రాంతాలకు యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు లభించింది. అందులో లేపాక్షి ఆలయం కూడా ఉండడం గమనార్హం. ఫలితంగా ఈ తాత్కాలిక జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి తొలిసారి స్థానం వరించింది. మరో ఆరు నెలల్లో యునెస్కో తుది జాబితాను విడుదల చేస్తుంది. అందులో కనుక లేపాక్షి ఆలయానికి చోటు దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఆలయానికి మంచి గుర్తింపు లభిస్తుంది. మరి.. ఈవిషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.