Kurnool MP: ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరిని అనేక విధాలుగా సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. కొందరు ఆశకు పోయి.. సైబర్ దొంగల ఉచ్చులో పడితే.. మరికొందరు బ్యాంకు అప్ డేట్ విషయంలో అతి జాగ్రత్తతో వారి ఉచ్చులో పడుతున్నారు. ఇలా వారి వలలో చిక్కి చాలామంది లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు సైతం ఈ సైబర్ మోసాల బారినపడ్డారు. తాజాగా కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ను ఓ సైబర్ దొంగ బురిడీ కొట్టించాడు. వివరాల్లోకి వెళ్తే..
కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ కు బ్యాంకు ఖాతా బ్లాక్ అయిందని, దానిని వెంటనే పాన్ నంబర తో అప్ డేట్ చేసుకోవాలంటూ మొన్న ఆయన ఫోన్ కి మెసేజ్ వచ్చింది. అయితే అప్ డేట్ చేసుకునేందుకు మెసేజ్ లో ఓ లింక్ కూడా ఉండడంతో నిజమేనని భావించారు. లింకు ఓపెన్ చేసి వివరాలు రాసి..సెండ్ చేశారు. వెంటనే ఎంపీ మొబైల్ కు ఓటీపీ వచ్చింది. HDFC కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానంటూు ఓ వ్యక్తి ఫోన్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ నంబర్లు అడిగి ఖాతా అప్ డేట్ అయిపోతుందని చెప్పి ఫోన్ పెట్టేశాడు.
ఫోన్ పెట్టేసిన కాసేపటికే ఒకసారి రూ.48,700, మరోసారి రూ.49,000 డ్రా అయినట్లు ఎంపీ మొబైల్ కు మెసేజ్ వచ్చింది. అది చూసి.. ఆశ్చర్యానికి గురైన ఎంపీ , వెంటనే బ్యాంకుకు ఫోన్ చేస్తే అసలు మోసం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాడు తనను మోసం చేసినట్లు గ్రహించిన ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన బ్యాంకు ఖాతనా నుంచి సైబర్ నేరగాడు రూ.97,699 కాజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలోతెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.