Kurnool MP: ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరిని అనేక విధాలుగా సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. కొందరు ఆశకు పోయి.. సైబర్ దొంగల ఉచ్చులో పడితే.. మరికొందరు బ్యాంకు అప్ డేట్ విషయంలో అతి జాగ్రత్తతో వారి ఉచ్చులో పడుతున్నారు. ఇలా వారి వలలో చిక్కి చాలామంది లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు సైతం ఈ సైబర్ మోసాల బారినపడ్డారు. […]