ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పక్రియ పూరైయింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా ఆ సంఖ్యను 26కు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అనుకూలంగా మరికొందరు వ్యతిరేకంగా స్వరాలు వినిపిస్తున్నారు. అభిప్రాయాలు అలా ఉంచితే.. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని ప్రాంతాల్లో వింత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓకే నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలోకి వెళ్లడం. ఓకే గ్రామం రెండు జిల్లాల పరిధిలోకి వెళ్లడం వంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని చిన్న ద్వారంపుడి గ్రామంలో ఇలాంటి వింత పరిస్థితి ఏర్పడింది.
చిన్న ద్వారంపూడి గ్రామం ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఊరు రెండు జిల్లాల్లోకి వెళ్లింది. గ్రామంలో ఒక వైపు ఇళ్లన్నీ కోనసీమ జిల్లాలోకి వెళ్లగా.. మరోవైపు ఉన్న ఇళ్లన్నీ తూర్పు గోదావరి జిల్లాలోకి వెళ్లిపోయాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో చిన్న ద్వారంపూడి గ్రామంలో ఈ వింత పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితితో ఎదురెదురుగా ఉన్న బంధువులు సైతం వేర్వేరు జిల్లాల్లోకి మారిపోయారు. దీంతో చిన్న ద్వారంపూడి గ్రామంలో గందరగోళం నెలకొంది. ఓకే గ్రామంలో ఎదురుగా ఉన్న తాము వేరు వేరు జిల్లాలు గా విడిపోయామంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తమను కోనసీమ జిల్లా నుండి విడదీసి దగ్గరలో ఉన్న రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లాలో కలపాలని చిన్న ద్వారంపూడి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.