నేటికాలంలో సినిమాలు, టీవీలో కార్యక్రమాలు, సోషల్ మీడియా ప్రభావంతో.. యువత చెడి పోతున్నారని కొందరు అభిప్రాయ పడుతున్నారు. వారి మాటలు నిజమే అన్నట్లు తరచూ కొన్ని దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా తూర్పూ గోదావరి జిల్లాలో 9వ తరగతి విద్యార్థిపై మరొకరు కత్తితో దాడి చేశాడు.
నేటికాలంలో సినిమాలు, టీవీలో కార్యక్రమాలు, సోషల్ మీడియా ప్రభావంతో.. యువత చెడి పోతున్నారని కొందరు అభిప్రాయ పడుతున్నారు. వారి మాటలు నిజమే అన్నట్లు తరచూ కొన్ని దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారంలో యువత చాలా ఘోరాలకు పాల్పడుతుంది. ఇటీవలే అబ్ధుల్లాపూర్ మెట్ లో జరిగిన నవీన్ హత్య ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ప్రేమ విషయంలో 9వ తరగతి విద్యార్థిపై మరొకరు కత్తితో దాడి చేశారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఓ అమ్మాయి విషయమే విద్యార్థుల మధ్య ఘర్షణకు కారణంగా స్థానికులు చెబుతున్నారు. రాజానగరం చెందిన లోడగాల ఉదయ్ శంకర్ అనే విద్యార్థి అదే తరగతిలో చదువుతున్న పింక్ హరి సాయి అనే మరొక విద్యార్థి మధ్య ఓ అమ్మాయి విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి.. ఉదయ్ శంకర్, హరి సాయిపై కత్తితో దాడి చేశాడు. టీచర్ల అందరూ ఉండగానే పరీక్ష కేంద్రంలో ఈ ఘటన జరిగింది.
కత్తి దాడిలో గాయపడిన హరి సాయి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో పడిపోయిన హరిని ఉపాధ్యాయులు హుటాహుటిన రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రిలో హరిసాయికి వైద్యులు శస్త్ర చికిత్స చేస్తున్నారు. కానీ, 9వ తరగతి విద్యార్థులు ఓ అమ్మాయి కోసం దాడికి దిగడం స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి.. చదువుకోవాల్సిన విద్యార్థులు ఇలా కత్తులతో దాడులు చేసుకుని స్థితికి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.