కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు అనేక పరీక్షలు నిర్వహిస్తుంటాయి. ఇలా పరీక్షలను నిర్వహించే క్రమంలో అప్పుడప్పుడు అభ్యర్థులకు శుభవార్తల కూడా చెప్తుంటాయి. మార్కులు కలపడం , పరీక్షల ప్రిపరేషన్ కు సమయం ఎక్కువగా ఇవ్వడం, పరీక్షలను లోకల్ లాంగ్వేజ్ లో రాసేందుకు అనుమతించడం..వంటి అనేక గుడ్ న్యూస్ లో చెప్తుంటారు. తాజాగా ఏపీపీఎస్సీ కూడా పరీక్షలు రాసే వారికి ఓ శుభవార్త చెప్పింది.
విద్యార్థులు నుంచి ఉద్యోగుల వరకు అందరూ తరచూ ఏదో ఒక పరీక్ష రాస్తునే ఉంటారు. ముఖ్యంగా విద్యార్థులు అయితే తమ విద్యాసంవత్సరంలో పలు ఎగ్జామ్స్ రాస్తుంటారు. విద్యాశాఖ నిర్వహించే పరీక్షలను అయితే ఎంతో భయంతో రాస్తుంటారు. అలానే నిరుద్యోగులు ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలు రాస్తుంటారు. వీరిద్దరితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ డిపార్ట్ మెంట్ కు సంబంధంచిన ఎగ్జామ్స్ రాస్తుంటారు. అయితే ఇలా పరీక్షలు రాసేవారికి అధికారులు తరచూ గుడ్ న్యూస్ చెప్తుంటారు. ఇటీవలే ఏపీలో జరిగిన ఇంటర్ విద్యార్థుల విషయంలో కొన్ని మార్కులు కలుపుతున్నట్లు బోర్డు చెప్పింది. తాజాగా ఏపీపీఎస్సీ పరీక్షలు రాసే వారికి శుభవార్త చెప్పింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు అనేక పరీక్షలు నిర్వహిస్తుంటాయి. ఇలా పరీక్షలను నిర్వహించే క్రమంలో అప్పుడప్పుడు అభ్యర్థులకు శుభవార్తల కూడా చెప్తుంటాయి. మార్కులు కలపడం, పరీక్షల ప్రిపరేషన్ కు సమయం ఎక్కువగా ఇవ్వడం, పరీక్షలను లోకల్ లాంగ్వేజ్ లో రాసేందుకు అనుమతించడం..వంటి అనేక గుడ్ న్యూస్ లో చెప్తుంటారు. ఇటీవలే ఏపీ ఇంటర్ బోర్డు కొన్ని కారణలతో విద్యార్థులు రెండు మార్కులు కలుపుతున్నట్లు ప్రకటించింది. అలానే గతంలోనూ ఇలాగే పలు నిర్ణయాలు అధికారులు తీసుకుంటారు. తాజాగా ఏపీపీఎస్సీ కూడా పరీక్ష రాసే వారికి శుభవార్త చెప్పింది. అయితే అది కేవలం కొన్ని ప్రత్యేక విభాగాల్లో పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల విషయంలో మాత్రమే.
కొన్ని ప్రత్యేక విభాగాల్లో నిర్వహించే పరీక్షలను తెలుగులోనూ నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. గతంలో కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే ఉండేది. తాజాగా తెలుగులోనూ నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. వాటిల్లో టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్, ఫిఫరీస్, బిల్డింగ్ ఓవర్సీర్, టౌన్ ఫ్లానింగ్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, ఇండస్ట్రీయల్ సర్వీస్, ఆహార భద్రత ఆధికారి, ఏఈఈ, ఎఫ్ఆర్ఎ, ఫారెస్టచు సర్వీస్ సహా మరికొన్ని పరీక్షలను ఇంగ్లీష్ తో పాటు తెలుగులోనూ నిర్వహిస్తారు. మరి.. ఏపీపీఎస్సీ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.