ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాషకు, తెలుగు వారికి ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు గడ్డ నుంచి విదేశాలకు వెళ్లి అక్కడ స్థిర పడి.. అనేక ఉన్నత పదవులు చేపట్టిన వారు ఎందరో ఉన్నారు. ఎన్నో అరుదైన గౌరవాలు పొందినవారు ఉన్నారు. అలా ఎంతో మంది తెలుగు జాతి ఖ్యాతిని విదేశాల్లో ఎవరెస్టు శిఖరం అంత ఎత్తుకు తీసుకెళ్తున్నారు. తాజాగా మన తెలుగు విద్యార్థికి ఆస్ట్రేలియా రాజకీయాల్లో అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాల కందుకూరుకు చెందిన తనూజ్ చౌదరి(15)కి ఎమ్మెల్సీ పదవి దక్కింది.
ఆస్ట్రేలియాలోని యువత విభాగంలో తనూజ్ కి ఎమ్మెల్సీ పదవికి ఎంపిక అయ్యారు. అక్కడ ఇంటర్నీడియట్ మొదటి సంవత్సరం చదువుతన్నతనూజ్ పలుసేవా కార్యక్రమాల్లో, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అతడి సేవా దృక్పథాన్ని గుర్తించిన స్థానికులు.. ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసినట్లు బాలుని తండ్రి తెలియజేశాడు. తనూజ్ తల్లిదండ్రులు రామకృష్ణ, ప్రత్యూష పదేళ్ల క్రితం కందుకూరు నుంచి ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అక్కడ అతి తక్కువ కాలంలోనే రామకృష్ణ మంచి స్థాయికి ఎదిగాడు. ఆయనకు కూడా చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. అదే తన కుమారుడు తనూజ్ కి నేర్పించారు. ఆ మంచి గుణమే ఇప్పుడు తనూజ్ కు ఆస్ట్రేలియా రాజకీయాల్లో ఈ అరుదైన గౌవరం దక్కేలా చేసింది. తెలుగు వ్యక్తికి ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.