దీపావళి పండుగ సందర్భంగా గురువారం వ్యాక్సినేషన్‌కు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. వ్యాక్సిన్ వేసే సిబ్బంది పండుగలో పాల్గొనే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. నవంబర్ 4న వాక్సినేషన్ కార్యక్రమానికి విరామం ఇచ్చి, శుక్రవారం నుంచి యథావిధిగా వ్యాక్సినేషన్ కొనసాగనుంది. అలాగే దీపావళి సందర్భంగా ఇంట్లో దీపాలు వెలిగించే వారు, టపాసులు కాల్చే వారు చేతులకు శానిటైజర్ వాడొద్దని అధికారులు సూచించారు. శానిటైజర్‌లో మండే గుణం ఉన్నందున దీపాలు వెలిగించే సమయంలో మంటలు అంటుకునే ప్రమాదం […]
కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం కావడంతో వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం కరోనా చేసిన బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రపంచ దేశాలు మొత్తం ఆర్థికంగా కుంగిపోయే స్థితికి వచ్చింది. ఉపాది లేక వేల కుంటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే కరోనా కట్టడి చేసేందుకు వైద్యులు ముమ్ముర కృషి చేయడం వల్ల వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఓ వైపు ప్రభుత్వం […]
కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నా కొన్ని చోట్లో జనాలు ముందుకు రావడం లేదు. వ్యాక్సిన్ తీసుకుంటే ఏమన్న అవుతుందేమోనని చాలా మంది భయపడుతున్నారు. అలాంటి వారి భయం పొగొట్టి, వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఒక వినూత్న ఆలోచన చేశారు. మురికివాడల్లో కొన్నిచోట్ల వ్యాక్సినేషన్ కార్యక్రమం స్లోగా జరుగుతున్నట్లు గ్రహించి అక్కడ మొదటి డోసు వ్యాక్సినేషనులో వందశాతం లక్ష్యాన్ని సాధించేందుకుగాను టీకా తీసుకున్నవారికి వంటనూనె […]
భారతదేశమంతటా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 40 కోట్ల మైలురాయిని దాటేసింది. 50,09,914 శిబిరాల ద్వారా టీకా డోసుల పంపిణీ పూర్తయినట్టు అందిన సమాచారం సూచిస్తోంది. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా ముమ్మరంగా చేపడుతోంది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ పరంగా భారత్ మరో మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టీకాలను భుజాలకు ఇస్తారని, అయితే కోవిడ్ […]
దేశవ్యాప్తంగా కోవిడ్ రెండో వేవ్ ప్రభావం తగ్గుతున్న విషయం విదితమే. గత కొద్ది రోజుల క్రితం రోజువారీ కేసుల సంఖ్య భారీగా ఉండేది. కానీ ప్రస్తుతం 1 లక్షకు దిగువకు కేసులు వచ్చేశాయి. జూన్ చివరి వరకు కేసులు మరింతగా తగ్గుతాయని, కోవిడ్ రెండో వేవ్ ముగుస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే అక్టోబర్ వరకు మూడో వేవ్ వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు రాయిటర్స్ నిర్వహించిన మెడికల్ ఎక్స్‌పర్ట్స్ పోల్‌లో వెల్లడైంది. భారత్‌లో కోవిడ్ […]
వ్యాక్సినేషన్ ప్రక్రియలో నిర్దేశించకున్న సమయం కంటే ముందే బైడెన్ తన లక్ష్యాలను సాధించారు. ఈ క్రమంలోనే అగ్రరాజ్య అధినేత జో బైడెన్ తాజాగా మరో కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. జూలై 4 నాటికి 70 శాతం మంది 18ఏళ్ల యువతకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని బైడెన్ నిర్ణయించుకున్నారు. 18 కోట్ల మందికి కనీసం ఒక డోసు, 16 కోట్ల మందికి రెండు డోసులు ఇచ్చేవిధంగా ప్రణాళికలు రూపొందించాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. అయితే వ్యాక్సిన్ […]
కరోనా ప్రారంభమైన నాటినుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. సాఫ్ట్‌వేర్ కంపెనీలతో పాటు పెద్ద సంస్థల నుంచి చిన్న సంస్థల వరకు.. అన్నీ తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కంపెనీల ఉద్యోగులు గతేడాది మార్చి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అయితే రోజూ ఇంట్లోనే ఉంటూ, ఉద్యోగం చేస్తూ కాలు బయటకు పెట్టకుండా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ – […]
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లు మహమ్మారిని ఎదుర్కోవడంలో సత్ఫలితాలిస్తున్నట్లు వాస్తవ నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా వైరస్‌బారిన పడి ప్రాణాలు కోల్పోయే ముప్పు నుంచి పూర్తి రక్షణ కల్పిస్తున్నాయనే వార్తలు మరింత రిలీఫ్ ఇస్తున్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన ఆస్ట్రాజెనికా (కొవిషీల్డ్) కరోనా టీకాను సింగిల్ డోస్ వేసుకున్నా, వైరస్ తో చనిపోయే ప్రమాదం 80 శాతం వరకూ తగ్గుతుందని ‘పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ)’ సంస్థ వెల్లడించింది. అలాగే ఫైజర్ బయో ఎన్ […]
కరోనా నేపథ్యంలో మీరు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఒక వేళ మీరు ఆరోగ్యకరమైన ఆహారానికి, అలవాట్లకు దూరంగా ఉంటున్నట్లయితే ఈ రోజు నుంచి మీలో మార్పు రావాలి. లేకపోతే మహమ్మారికి బలయ్యే ప్రమాదం ఉంది. మీకు కరోనా సోకుతుందనే భయం వెంటాడుతున్నా ఇప్పటికే మీరు కరోనాతో బాధపడుతున్నా ఆందోళన చెందవద్దు. మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. తాజాగా 45 ఏళ్ల లోపువారికి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారు […]
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఢిల్లీలో రోజురోజుకూ ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ కొరత కారణంగా డాక్టర్ సహా 8 మంది రోగులు మరణించారు. ఢిల్లీలో బాత్రా ఆసుపత్రిలో కొంతకాలం ఆక్సిజన్ అయిపోవడంతో ఎనిమిది మంది రోగులు మరణించారని ఢిల్లీలోని బాత్రా హాస్పిటల్ శనివారం తెలిపింది. ఆక్సిజన్ కొరతతో మరణించిన వారిలో డాక్టర్లలో ఒకరు ఉన్నారని ఆసుపత్రి ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. మరోవైపు […]