కరోనా నేపథ్యంలో మీరు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఒక వేళ మీరు ఆరోగ్యకరమైన ఆహారానికి, అలవాట్లకు దూరంగా ఉంటున్నట్లయితే ఈ రోజు నుంచి మీలో మార్పు రావాలి. లేకపోతే మహమ్మారికి బలయ్యే ప్రమాదం ఉంది. మీకు కరోనా సోకుతుందనే భయం వెంటాడుతున్నా ఇప్పటికే మీరు కరోనాతో బాధపడుతున్నా ఆందోళన చెందవద్దు. మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. తాజాగా 45 ఏళ్ల లోపువారికి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారు కొన్ని నియమనిబంధనలు పాటించాలని వైద్య బృందం కోరుతుంది. తినే తిండి దగ్గరనుంచి వేసుకునే మందుల వరకూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత జలుబు చేస్తే పసుపు, ఉప్పు, మిరియాల పొడి వేసి చేసిన చికెన్ సూప్ తాగితే ఉపశమనం ఉంటుంది. అదే శాకాహారులు క్యారెట్, బీన్స్, పాలకూర, బ్రకోలీ, క్యాప్సికమ్, పుట్టగొడుగు సూప్ తాగొచ్చు. ఈ సమాచారాన్ని కేవలం మీ అవగాహన కోసమే. ఇది అర్హత కలిగిన వైద్యుల అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం వైద్యులు లేదా ఆహార నిపుణులను సంప్రదించండి.