రాబోయే మూడు రోజుల్లో ఏపీలోని ఈ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తీవ్ర వడగాల్పులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో కూడా పిడుగులు, వడగండ్లతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు భానుడు ప్రతాపాన్ని చూపిస్తే.. ఇప్పుడు వరుణుడు విజృంభిస్తున్నాడు. ఇప్పటికే వర్షాలు పడి పలు ప్రాంతాల్లో పంట నష్టం జరగడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిలాలకు మళ్ళీ వాన గండం పొంచివుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇటీవల ఏపీలో నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు సృష్టించిన బీభత్సం అంతఇంతకాదు. దాని నుంచి ఇంకా తేరుకోక ముందే ఏపీకి మరో తుఫాన్ గండం వచ్చింది. ఈ తుఫాన్ కారణంగా పలు జిల్లాలో పాఠశాలకు సెలవులు ప్రకటించారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు. ఏపీ వైపు జావద్ తుఫాన్ దూసుకొస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ […]
గతంలో కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన జిల్లాల్లో నెల్లూరు ఒక్కటి. ఇటీవల వర్షాలు కాస్త తగ్గిన్నట్లు కనిపించాయి. నెల్లూరును వర్షాలు వీడటం లేనట్లుంది. అల్పపీడనం కారణంగా నాలుగు రోజులుగా జిల్లాలో మళ్లీ వర్షాలు కురుస్తోన్నాయి. దీంతో గూడురు, మనుబోలు మధ్య రహదారిపై పంబలేరు నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. పంబలేరు ప్రవాహంతో 16వ నెంబర్ జాతీయ రహదారిపై భారీగా వానాలు నిలిచిపోయాయి. వాహనాల్లోని ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధిచిన డ్రోన్ వీడియో అక్కడి పరిస్థితులకు అద్దం […]
అమరావతి- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వానలు వెంటాడుతున్నాయి. మూడు రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షాలతో ఇంకా తేరుకోకముందే ఆంధ్రప్రదేశ్‌ను మరో వాన గండం భయపెడుతోంది. ఈ మేరకు విశాఖపట్నం వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాబోవు 72 గంటల్లో ఏ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో తక్కువ ట్రోపోస్పియరిక్ స్థాయిల్లో సర్క్యులేషన్ ఉందని వాతావరణ నిపుణలు గుర్తించారు. రాబోయే నాలుగైదు రోజుల్లో […]
అమరావతి- బంగాళాఖాతంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు కోస్తా తీరాలకు దగ్గరగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ మధ్యన ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 1.5 కిలో మీటర్ల నుంచి 4.5 కిలో మీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతుందని ఐఎండీ పేర్కొంది. దీంతో ఈ నెల 6న ఉత్తర, దాన్ని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీని […]
విశాఖపట్నం- ఇప్పటికే కరోనా అతలాకుతలం చేస్తోంటే.. దీనికి తోడు మరోవైపు తుఫాను ముంచుకొస్తోంది. దీంతో ప్రజలతం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఆగ్నేయ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడింది. ఇది కేరళ, కర్ణాటక వైపుగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం బలపడి ఈ నెల 16 నాటికి తుఫాన్‌గా, ఆ తర్వాత మరింత బలపడి తీవ్ర, అతి తీవ్ర తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉందని విశాఖపట్నం వాతావరణ […]