తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు భానుడు ప్రతాపాన్ని చూపిస్తే.. ఇప్పుడు వరుణుడు విజృంభిస్తున్నాడు. ఇప్పటికే వర్షాలు పడి పలు ప్రాంతాల్లో పంట నష్టం జరగడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏపీలో మరో రెండు రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని.. సామాన్య ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని.. రైతులు తమ పంట విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ హెచ్చరిస్తుంది.
ఇటీవల వాతావరణంలో అనూహ్య మార్పులు సంబవించాయని.. బాంగాళా ఖాతంలో ఉత్తర తమిళనాడు మొదలు కొని కర్ణాటక మీదుగా అరెబీయన్ తీరవం విస్తరించి ఉన్న ద్రోణులు, ఆవర్తనాల ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజలు పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా ఐఎండీ తెలియజేసింది. రానున్న మూడు రోజుల్లో ఏపీలోని దక్షణి కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. ఒక్కసారిగా ఏపీలో మారిపోయిన వాతావరణం కారణంగా ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
రేపు ఆదివారం ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అల్లూరి సీతారామారాజు, కాకినాడా, తూగో-పగో జిల్లాలతో పాటు ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఏపీలోని కాస్తాంధ్ర, రాయలసీమ లో 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులుతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో నిన్నటి నుంచి ఏపిలో పలు చోట్ల కురిసిన వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయని.. ముఖ్యంగా ఎండు మిర్చి నిల్వలు తడిసి పోవడంతో రైతులు లబోదిబో అంటున్నారు.