ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్టీసీలో పదోన్నతులు పొందిన వారి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే..!
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. పోలీస్ బాస్ ను ఇంత సడెన్ గా ఎందుకు బదిలీ చేశారు.. ఇది సాధారణ బదిలీయేనా.. లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా.. అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అటు ప్రతిపక్షాలు కూడా కావాలనే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సవాంగ్ ని బదిలీ చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇది సాధారణ బదిలీనే అని […]
రాజకీయ పార్టీ, నేతలకు అధికారంతో సంబంధం లేకుండా.. విపక్షంలో ఉన్నా సరే.. నిత్యం ప్రజల్లో ఉండాలి. ప్రజా సమస్యలపై పోరాడాలి. అలా కాకుండా మౌనం దాల్చితే.. అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్తుంది. కార్యకర్తలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి తలెత్తుతుంది. ఎందుకంటే అధిష్టానం నిర్ణయంతోనే వారు ఏ కార్యక్రమాన్ని అయినా నిర్వహించాలి. అలాంటిది అధినేతే మౌనంగా ఉంటే.. తాజాగా ఏపీ టీడీపీలో ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా టీడీపీ ఏ అంశంపై […]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగులు ఎంత అసంతృప్తిగా ఉన్నారో.. ‘చలో విజయవాడ’ కార్యక్రమంతో అర్థం అయ్యింది. ఉద్యోగులను కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నించి కూడా విఫలం అయ్యింది. అయితే ఉద్యోగుల నిరసన సమయంలో అక్కడక్కడా కాస్త ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా.. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి మీద విమర్శలు చేశారు. సజ్జల ఎవరని ఉద్యోగులు ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. […]
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. ప్రభుత్వంపై ఉద్యోగుల్లో అసంతృప్తి ఏ రేంజ్ లో ఉందో ‘చలో విజయవాడ’తో అర్థం అయ్యింది. ఈ కార్యక్రమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసింది. వారం రోజలు ముందు నుంచే కార్యక్రమాన్ని ఎలా అడ్డుకోవాలి అనే దాని మీద వ్యూహాలు రచిస్తూ వచ్చింది. అనుమతి నిరాకరణ మొదలు ముందస్తు అరెస్టుల వరకు ఎన్ని విధాలుగా ఉద్యోగులను అడ్డుకోవచ్చో అన్ని రకాలుగా ప్రయత్నించింది. అయినా సరే […]
ఉద్యోగులు పంతం నెగ్గించుకున్నారు. పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం విజయవంతం అయ్యింది. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ విజయవంతైనట్లు పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రకటించారు. పోలీసుల అడ్డంకులు, నిర్బంధాలను దాటుకుని సుమారు 50 వేల మంది ఉద్యోగులు విజయవాడ వచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు.ఇకపై మంత్రుల కమిటితో చర్చలు జరిపేది లేదని స్టీరింగ్ […]
గత కొన్ని రోజులుగా ఏపిలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య పీఆర్సీ వివాదం చినికి చినికి గాలివానలా మారింది. పీఆర్సీ జీఓలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. అయితే జీఓలో పేర్కొన్న విధంగా రికవరీ లేకుండా జీతాలు వేయాలని.. ఏ ఒక్క ఉద్యోగి జీతం నుంచి రికవరీ చేయొద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విచారణలో భాగంగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి […]
ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ రగడ కొనసాగుతుంది. పీఆర్సీ సాధన ఉద్యమ కార్యాచరణలో భాగంగా గురువారం నుంచి నాలుగు రోజుల పాటు స్థానిక ఏపీఎన్జీవో హోమ్ వద్ద రిలేనిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ఉద్యోగ సంఘ నాయకులు తెలిపారు. విజయవాడ ధర్నా చౌక్ లో రిలే దీక్షలో రాష్ట్ర నేతలు పాల్గొననున్నారు. రిలే నిరాహార దీక్షల్లో ఉద్యోగులు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నామని జేఏసీ నేతలు చెప్పారు. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష […]