ధోని మాస్టర్ ప్లాన్. టీ-ట్వంటీ వరల్డ్ కప్ జట్టులోకి ఋతురాజ్ గైక్వాడ్!

ruturaj gaikwad dhoni

రానున్న టీ-ట్వంటీ వరల్డ్ కప్ జట్టులోకి ఋతురాజ్ గైక్వాడ్ ని తీసుకోనున్నారా? తాజాగా ఇదే వార్త కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఐపీఎల్-2021 సెకండ్ సీజన్ లో ఋతురాజ్ గైక్వాడ్ మంచి ఫామ్ లో ఉండి తన అద్భుతమైన ఆట తీరుతో రాణిస్తున్నాడు. యూఏఈలో శనివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఈ మ్యాచ్ లో ఋతురాజ్ గైక్వాడ్ రాజస్థాన్ రాయల్స్ బోలర్ లకు చుక్కలు చూపిస్తూ ఏకంగా సెంచరీతో చెలరేగాడు.

మంచి ఫామ్ తో దూసుకుపోతున్న ఋతురాజ్ గైక్వాడ్ ఆట తీరుపై ఇప్పుడు అందరూ కన్ను పడింది. అయితే ఎలాగైన రానున్న టీ-ట్వంటీ వరల్డ్ కప్ జట్టులోకి ఋతురాజ్ గైక్వాడ్ ని పంపేందుకు ధోనీ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ జట్టుకు ధోనీ కెప్టెన్ గా వ్యవహరిస్తుండటంతో ఈ ఆటగాడిని టీ-ట్వంటీ వరల్డ్ కప్ జట్టులోకి పంపేందుకు ధోనీ తెర వెనుక మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.

ఇక ఈ విషయంపై ఎలాగైన కెప్టెన్ విరాట్ కోహ్లీని, సెలెక్టర్ లను ఒప్పించేందుకు ధోనీ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ధోనీ సూచనల మేరకు రానున్న టీ-ట్వంటీ వరల్డ్ కప్ జట్టులోకి ఋతురాజ్ గైక్వాడ్ వెళ్లనున్నాడా అనేది ఇంకా తెలియాల్సిన అంశం. ఇక ఈ అంశంపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.