ఒకేసారి నలుగురు దూరం.. చైన్నై సూపర్‌కింగ్స్‌ కి భారీ షాకే!

chennai super kings

యూఏఈ వేదికగా ఐపీఎల్‌ సెకెండ్‌ హాఫ్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పిటికే టీమ్‌లు అన్నీ యూఏఈ చేరుకున్నాయి. సెప్టెంబర్‌ 19 నుంచి ఐపీఎల్‌ ప్రారంభం కానుండగా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు భారీ షాకే తగిలింది. మొత్తం నలుగురు విదేశీ ఆటగాళ్లు టీమ్‌కు దూరం కానున్నారు. ఇద్దరు మొత్తానికే దూరంకాగా.. మరో ఇద్దరు ప్లేఆఫ్స్‌కు దూరంకానున్నట్లు తెలుస్తోంది. గాయాలు, టీ20 వరల్డ్‌ కప్‌ ఇలా కారణం ఏదైనా ధోనీ సారథ్యంలోని చెన్నైకి మాత్రం కష్టాలు తప్పేలాలేవు.

కరేబియన్‌ లీగ్‌లో బ్రావో, డుప్లెసిస్ గాయపడ్డారు. గాయం కారణంగా బ్రావో కేవలం బ్యాటింగ్‌కే పరిమితం కానున్నాడు. పీపీఎల్‌లో తగిలిన గాయం తిరగబెట్టడంతో డుప్లెసిస్‌ ఐపీఎల్‌ మొత్తానికే దూరమయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు ఇంగ్లీష్‌ క్రికెటర్లు సామ్ కరణ్‌, మొయిన్ అలీలు టీ20 ప్రపంచకప్ దృష్ట్యా ప్లేఆఫ్స్‌కు దూరం కానున్నారు. ఈసీబీ రూల్స్‌ ప్రకారం ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ ప్రారంభానికి ముందే జట్టులో చేరాలి.

ఐపీఎల్ 14 ఫస్టాఫ్‌ వాయిదా సమయానికి ఏడు మ్యాచ్‌లు ఆడి.. ఐదింట్లో పెలిచిన చెన్నై రెండో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్‌కు మూడు విజయాల దూరంగా ఉన్న చెన్నైకి ఇద గడ్డుకాలమనే చెప్పాలి. కీలక మ్యాచ్‌లలో స్టార్‌ ప్లేయర్లు లేకుంటే.. విజయావకాశాలపై ప్రభావం పడుతుంది. ఐపీఎల్‌ సెకెండాఫ్‌ తొలి మ్యాచ్‌లోనే ముంబయితో తలపడనుంది చెన్నై సూపర్‌కింగ్స్‌.