2024 నుంచి ఏడాదికో ఐసీసీ కప్‌! ఇండియాలో ఎప్పుడంటే?

8 Tournament Schedule Released by ICC - Suman TV

గతంలో ఎన్నడూ లేని విధంగా ఐసీసీ ఒకే సారి 8 మెగా టోర్నీల వివరాలను వెల్లడించింది. 2024 నుంచి ప్రతి ఏడాది ఒక వరల్డ్ కప్‌ను నిర్వహించనుంది. ఈ మెగా టోర్నీలను దేశం నిర్వహించానే వివరాలను కూడా ఐసీసీ స్పష్టంగా పేర్కొంది. కాగా 2024లో టీ20 వరల్డ్‌ కప్‌ను యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఒక ఛాంపియన్స్‌ ట్రోఫీని మళ్లీ ప్రకటించిన ఐసీసీ 2025లో ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణకు దాయాది పాకిస్తాన్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక 2026లో ఇండియా, శ్రీలంక సంయుక్తంగా టీ20 వరల్డ్‌ కప్‌ నిర్వహించనున్నాయి.

2027లో జరగనున్న వన్డే వరల్డ్‌ కప్‌ను సౌతాఫ్రికా, జింబ్వాబే, నమీబియా సంయుక్తంగా నిర్వహించనున్నాయి. 2028లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సంయుక్తంగా టీ20 వరల్డ్‌ కప్‌ నిర్వహిస్తాయి. ఒక ఇండియాలో 2029 ఛాంపియన్స్‌ ట్రోఫీ పోటీలు జరుగుతాయి. 2030లో ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌ సంయుక్తంగా టీ20 వరల్డ్‌ కప్‌ నిర్వహించనున్నాయి. 2031లో ఇండియా, బంగ్లాదేశ్‌ సంయుక్తంగా వన్డే వరల్డ్‌ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కాగా ప్రతిష్టాత్మాక టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ గురించి మాత్రం ఐసీసీ ప్రస్తావించలేదు.