IPL కారణంగా ఆస్ట్రేలియా జట్టులో గొడవలు అయ్యాయి: సైమండ్స్

Andrew Symonds

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ లీగ్ కే ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఐపీఎల్ ద్వారా అనేక మంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. ఈ లీగ్ ద్వారా చాలా మందికి డబ్బు, పేరు వచ్చింది. అదే క్రమంలో ఐపీఎల్ అనేది కొంత మంది ప్లేయర్ల మధ్య మనస్పర్థలకు కారణం అయింది. తాజాగా IPL పై ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ లో లభించిన సొమ్ము పాపిష్టిదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్ ప్రారంభం(2008)లో డెక్కన్ ఛార్జర్స్ తనను రూ.5.4 కోట్లకు కొనుగోలు చేసిందని, అదే క్లార్క్ తో తన స్నేహం శత్రుత్వంగా మారడానికి కారణమయ్యిందని వ్యాఖ్యానించాడు. ఇదే సమయంలో ఈ ఆల్ రౌండర్ మరో బాంబు పేల్చాడు. ఐపీఎల్‌లో తనకు భారీ ధర పలకడం చూసి క్లార్క్ అసూయ పడ్డాడని, అందుకే నేనంటే అతనికి నచ్చేది కాదని, ఈ విషయాన్ని మాథ్యూ హేడెన్ తనతో చెప్పాడని పేర్కొన్నాడు. ఆప్తమిత్రులుగా ఉన్న తమ మధ్య ఐపీఎల్‌ డబ్బే చిచ్చు పెట్టిందని, మొత్తంగా తమ రిలేషన్‌ దెబ్బ తినడానికి ఐపీఎలే కారణమైందని అన్నాడు. ఐపీఎల్‌లో లభించిన సొమ్ము పాపిష్టిదని, దాని వల్లే తన ఆప్తమిత్రుడు, మైఖేల్‌ క్లార్క్‌ తనకు దూరమయ్యాడని కామెంట్స్‌ చేశాడు.

Andrew Symonds

ఇప్పటికీ క్లార్క్‌ అంటే నాకు గౌరవం ఉందన్నాడు. అందుకే అన్ని విషయాలు బయటపెట్టలేకపోతున్నానని బ్రెట్‌ లీ పోడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ సైమండ్స్ ఈ వ్యాఖ్యలు చేశాడు.ఇదిలా ఉంటే, నిత్యం వివాదాలతో కెరీర్‌ను కొనసాగించిన సైమండ్స్‌.. ఆస్ట్రేలియా తరఫున 26 టెస్ట్‌లు, 198 వన్డేలు ఆడాడు. ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. మరి సైమండ్స్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.