ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ అలాన్ థామ్సన్(76) అనారోగ్య కారణంగా మంగళవారం తుది శ్వాసవిడిచారు. ఈ విషయాన్ని అతడి తమ్ముడు ట్వీటర్ వేదికగా ప్రకటించాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో థామ్సన్ బాధపడుతున్నట్లు అతడు తెలిపాడు. ఈ క్రమంలోనే ఆరోగ్యం క్షీణించడంతో అతడు మరణించినట్లు వెల్లడించాడు. 1970-71లో ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు థామ్సన్. ఆసిస్ తరపున కేవలం ఒక వన్డే, నాలుగు టెస్ట్ మ్యాచ్ ల్లో మాత్రమే ఆడాడు. కానీ భిన్నమైన బౌలింగ్ యాక్షన్ తో అందరిని ఆశ్చర్యపరిచేవాడు థామ్సన్. ఇక వన్డే క్రికెట్ చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డును తన పేర లిఖించుకున్నాడు అలాన్.
Former Australian Test bowler Alan Thomson, famous for taking the first wicket in one-day international cricket, has died aged 76: https://t.co/U35uUnUiF8#RIPFroggy @newscomauHQ pic.twitter.com/aQg0rDOE5P
— Nic Savage (@nic_savage1) November 2, 2022
అది 1971 జనవరి 5న ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య మెుట్టమెుదటి వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో తొలి వికెట్ తీసిన థామ్సన్.. వన్డే క్రికెట్ చరిత్రలో తొలి వికెట్ టేకర్ గా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. కొన్ని రోజుల కిందట థామ్సన్ తొంటికి ఆపరేషన్ జరిగింది. అయినప్పటికీ అతడి ఆరోగ్యం కుదుటపడలేదని థామ్సన్ సోదరుడు తెలపాడు. చివరికి మా అన్నయ్య మమ్మల్ని విడిచి వెళ్లిపోయాడు అంటూ ట్వీటర్ వేదికగా తన బాధను వెల్లడించాడు అలాన్ సోదరుడు. థామ్సన్ బౌలింగ్ యాక్షన్ భిన్నంగా ఉండటంతో అతడిని అభిమానులు ముద్దుగా ”ఫ్రాగీ” అని పిలుచుకునే వారు. అలాన్ కెరీర్ విషయానికి వస్తే.. ఒకే ఒక వన్డేలో 1 వికెట్ మాత్రమే తీశాడు. 4 టెస్టు మ్యాచ్ ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. అదీ కాక విక్టోరియా తరపున 44 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 184 వికెట్లు పడగొట్టాడు.
Former Australian bowler Alan Thomson, famous for taking the first wicket in men’s one-day international cricket, has died aged 76 #CricketTwitter https://t.co/HPX3eURAYr
— CricWick (@CricWick) November 1, 2022