ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ ఆదివారం కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. క్వీన్స్‌లాండ్‌లోని టౌన్స్‌విల్లే ఏరియా శివారులో కారు ప్రమాదం చోటు చేసుకుంది. సైమండ్స్ మృతిపై ప్రముఖ క్రికెటర్లందరూ సంతాపం తెలిపారు. సైమండ్స్‌తో తమకున్న జ్ఞాపకాలను సోషల్ మీడియాలో వేదికగా పంచుకున్నారు. కాగా.. సైమండ్స్ పెంచుకున్న రెండు పెంపుడు కుక్కలు కారు యాక్సిడెంట్లో త్రుటిలో బతికి బయటపడ్డాయి. ఇక అందులో ఓ పెంపుడు కుక్క చేసిన పనిని కన్నీళ్లు పెట్టిస్తుంది. సైమండ్స్ ప్రమాదానికి గురైన సమయంలో ఘటనా స్థలంలో ఉన్న వ్యక్తి భార్య స్పాట్‌లో జరిగిన ఘటనను వివరించింది.
ఆమె మాట్లాడుతూ.. ‘నా భర్త ఆ కారు యాక్సిడెంట్ అయిన వెంటనే వెళ్లి సైమండ్స్‌ను బతికించడానికి ప్రయత్నించాడు. కానీ సైమండ్స్ అప్పటికే చనిపోయారు. అతని పల్స్ అప్పటికే ఆగిపోయింది. సైమండ్స్ పెంచుకున్న రెండు పెంపుడు కుక్కలు అతనితో పాటు కారులో ఉన్నాయి. అవి కూడా చనిపోయే ఉండొచ్చనుకున్నాం. కానీ అవి త్రుటిలో సజీవంగా బయటపడ్డాయి. ఇక అందులో ఓ పెంపుడు కుక్క మాత్రం సైమండ్స్ మృతదేహం చుట్టూ అక్కడక్కడే తిరుగుతూ, మొరుగుతూ హృదయ విదారకంగా రోదించింది. దాని ప్రేలాపన చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మేము సైమండ్స్ దగ్గరికి వెళ్తున్న ప్రతిసారీ మా మీదకు అరిచింది. అతని మృతదేహాన్ని స్థానికుల సహాయంతో అక్కడి నుంచి హాస్పిటల్ తరలించేందుకు ప్రయత్నిస్తుంటే బాగా మొరిగింది’ అని పేర్కొంది.కుక్కలు ఎంతో విశ్వాసంగా ఉంటాయి అనే విషయాన్ని మరోసారి ఈ కుక్కలు నిరూపించాయి. తమను ఎంతో ప్రేమగా పెంచుకున్న యజమాని విగతజీవిగా పడి ఉండడంతో ఆ కుక్కలు సైతం తల్లడిల్లిపోయాయి. కాగా.. ఆస్ట్రేలియా జట్టు ఇప్పటివరకు చూసిన అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో సైమండ్స్ ఒకడు. జట్టుకు అన్ని విభాగాల్లో కీలక ఆటగాడిగా ఉంటూ తాను ఆడే రోజుల్లో ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సైమండ్స్ 1998లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అతను 26 టెస్ట్ మ్యాచ్‌లు, 198 వన్డేలు, 14 టీ20లు ఆడాడు. అలాగే 165 వికెట్లు, 6887పరుగులు చేశాడు. 2003, 2007లో ఆస్ట్రేలియా ప్రపంచ కప్ గెలుపొందిన జట్టులో ఆల్రౌండర్‌గా ఉన్నాడు. మరి సైమండ్స్ పెంపుడు కుక్కల విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Harpreet Singh Bhatia: ప్రముఖ క్రికెటర్ పై కేసు నమోదు.. అరెస్ట్!
Australian and Queensland cricket great Andrew Symonds has died at the age of 46. He crashed his car on a country road near Townsville with strangers and his pet dogs, who refused to leave his side. https://t.co/m0vfLeDccz @MarlinaWhop @7Cricket #7NEWS pic.twitter.com/t7gOC51g7f
— 7NEWS Brisbane (@7NewsBrisbane) May 15, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.