SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » reviews » Samajavaragamana Movie Review And Rating In Telugu

‘సామజవరగమన’ సినిమా రివ్యూ!

కొన్ని రోజులకే సరయు.. బాలు ప్రేమలో పడుతుంది. అయితే బాలుకు ప్రేమంటే గిట్టదు. అందుకే తనకు దగ్గరగా వచ్చే ప్రతీ అమ్మాయికి రాఖీ కడుతూ ఉంటాడు. అలాంటి అతడ్ని సరయు..

    Published Date - Thu - 29 June 23
    • facebook
    • twitter
    • |
        Follow Us
      • Suman TV Google News

‘సామజవరగమన’

29-06-2023, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌, 2h 20m U/A
థియేటర్స్ లో
  • నటినటులు:శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిశోర్ తదితరులు
  • దర్శకత్వం:రామ్ అబ్బరాజు
  • నిర్మాత:రాజేష్ దండా
  • సంగీతం:గోపీ సుందర్
  • సినిమాటోగ్రఫీ:రామ్ రెడ్డి

Rating

3/5

హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా ప్రయోగాలకు పెద్ద పీట వేసే యువ హీరోల్లో ‘శ్రీ విష్ణు ముందు వరుసలో ఉంటారు. శ్రీ విష్ణు సినిమాలు మినిమం గ్యారెంటీ సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. అతడు తీసిన సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా ఉండటంతో.. సినిమాకు వెళ్లిన ప్రేక్షకుడు హ్యాపీగా ఫీలవుతూ ఉంటాడు. శ్రీ విష్ణు గత సంవత్సరం ‘అల్లూరి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక, గురువారం ఆయన ‘సామజవరగమన’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ట్రైలర్‌తోనే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని తెలిసిపోయింది.  మరి, ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటి? ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ప్రేక్షకులను నిజంగానే ఎంటర్‌టైన్‌ చేసిందా? లేదా?  శ్రీ విష్ణుకు ‘సామజవరగమన’ ప్లస్సా? మైనస్సా?…

కథ:

బాల సుబ్రమణ్యం( శ్రీ విష్ణు) హైదరాబాద్‌కు చెందిన ఓ మిడిల్‌ క్లాస్‌ యువకుడు. నగరంలోని ఓ మల్టీప్లెక్స్‌లో పని చేస్తూ ఉంటాడు. మన బాలు ఒకరకంగా బడ్జెట్‌ పద్మనాభం లాంటి వాడు. అతడి సంపాదనతోనే కుటుంబం నడుస్తూ ఉంటుంది. అందుకే ఏ ఖర్చు చేసినా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటాడు. కానీ, కుటుంబం మాత్రం ఇతడికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తూ ఉంటుంది. ఇక, బాలు కుటుంబానికి పూర్వీకుల ఆస్తి ఉంటుంది. ఆ ఆస్తి బాలు తండ్రి ఉమా మహేశ్వర రావు(నరేష్‌) పేరు మీదకు రావాలంటే.. డిగ్రీ పాస్‌ కావాలని రూల్‌ ఉంటుంది. అందుకే ఉమా మహేశ్వర రావు 30 ఏళ్లుగా డిగ్రీ పరీక్షలు రాస్తూ ఉంటాడు. ఎన్ని సార్లు రాసినీ ఫెయిల్‌ అవుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో బాలు ఇంట్లోకి సరయు(రెబా మోనికా జాన్) పెయింగ్‌ గెస్ట్‌గా దిగుతుంది.

కొన్ని రోజులకే సరయు.. బాలు ప్రేమలో పడుతుంది. అయితే బాలుకు ప్రేమంటే గిట్టదు. అందుకే తనకు దగ్గరగా వచ్చే ప్రతీ అమ్మాయికి రాఖీ కడుతూ ఉంటాడు. అలాంటి అతడ్ని సరయు తన ప్రేమలో పడేస్తుంది. ఇందుకోసం చాలా తిప్పలు పడుతుంది. తండ్రికి తమ ప్రేమ విషయాన్ని చెబుతుంది. పెళ్లి జరిగే క్రమంలో బాలు కుటుంబంపై సరయు తండ్రి చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. సరయు తండ్రికి తమపై ఉన్న చెడు అభిప్రాయాన్ని పోగొట్టేందుకు బాలు పడే కష్టాలు ఏంటి? సరయు తండ్రిని ఒప్పించి బాలు పెళ్లి చేసుకుంటాడా? లేదా?. బాలు తండ్రి డిగ్రీ ఫాస​ అవుతాడా? లేదా ? అన్నది మిగిలిన కథ.

విశ్లేషణ: 

సినిమా ఇండస్ట్రీలో కొత్త కథలకు కొరత ఉందన్నది అక్షర సత్యం. ఇలాంటి ఈ సమయంలో ఉన్న కథలను ప్రేక్షకుడికి నచ్చేలా అటు, ఇటు చేసి వాడుకోవటంలోనే దర్శకుడి పని తీరు కనిపిస్తుంది. ఆ విషయంలో ‘సామజవరగమన’ దర్శకుడు రామ్ అబ్బరాజు సక్సెస్‌ సాధించారు. పాత కథనే పాలిస్‌ చేసి కొత్తగా తెరకెక్కించారు. సినిమా చూసే ప్రేక్షకుడికి కావాల్సింది ఎంటర్‌టైన్‌మెంట్‌ కాబట్టి.. ఈ సినిమా అందులో సక్సెస్‌ సాధించిందని చెప్పొచ్చు. దానికి తోడు కథ మొత్తం ఫ్యామిలీల చుట్టూ తిరుగుతుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Samaja varagaman Review And Rating (4)

ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో వచ్చిన నూటికి 70 శాతం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమాలు సక్సెస్‌ సాధించాయి. ఆ ఖాతాలోకే ఈ సినిమా కూడా చేరిపోయింది. కామెడీతో ఈ సినిమా ప్రేక్షకులకు ఎక్కడా బోరు కొట్టకుండా సాగుతుంది.  సాగ దీతలకు, బోరు కొట్టే ఎమోషన్స్‌కు దూరంగా ఈ సినిమా సాగుతుంది. మన పొట్టను చక్కలు చేసే సన్ని వేశాలు చాలానే ఉన్నాయి. సినిమా కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ బేస్‌గా వెళుతుంటుంది కాబట్టి.. ప్రేమకు పెద్దగా స్కోప్‌ ఉండదు. ఇ‍ద్దరూ ప్రేమలో పడే సన్ని వేశాలు కూడా అంత ఎఫెక్ట్‌గా అనిపించవు.

నటీనటుల పనితీరు: 

కామెడీ ఎంటర్‌టైనర్‌ సినిమాల్లో నటనకు పెద్ద పీట వేసేంత ఏమీ ఉండదు. ప్రేక్షకులను నవ్వించడానికి దెబ్బలు తిన్నా.. ఏడ్చినా.. ఏం చేసినా సరిపోతుంది. ఇక, ఈ సినిమాలో శ్రీ విష్ణు తన పాత సినిమాల్లో ఎలాంటి నటనతో అదరగొట్టారో.. అలానే ఈ సినిమాలోనూ చేశారు. ముఖ్యంగా కామెడీ టైమింగ్స్‌.. ఎక్స్‌ప్రెషన్స్‌తో.. డైలాగ్‌ డెలివరీతో సినిమాను ముందుకు నడిపించారు. శ్రీ విష్ణు తర్వాత అంతగా ఆకట్టుకున్న పాత్రలు చాలానే ఉన్నా.. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం నరేష్‌ గురించి. ఆయన తన నటనతో అమాయకపు ఓ మిడిల్‌ క్లాస్‌ ఫాదర్‌ క్యారెక్టర్‌లో అదరగొట్టారు. హీరోయిన్‌గా రెబా మోనికా జాన్ నటన కూడా ఆకట్టుకుంటుంది. కమెడియన్స్‌ వెన్నెల కిషోర్‌, సుదర్శన్‌ ఎప్పటిలా తమ పంచులతో ప్రేక్షకులను పడి పడి నవ్వించేశారు. శ్రీకాంత్‌ అయ్యంగర్‌తో పాటు మిగిలిన పాత్రధారులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బ్రహ్మాండంగా నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

సినిమా ఏదైనా కావచ్చు.. టెక్నిలక్‌ వాల్యూస్‌ బాగుంటేనే  అది సక్సెస్‌ సాధిస్తుంది. ఈ సినిమా విషయంలో టెక్నికల్‌ టీం చక్కగా పని చేసింది. సామజవరగమన సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు గోపీ సుందర్‌ సంగీతాన్ని అందించారు. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌, పాటలు ఆకట్టుకున్నాయి. కామెడీ టైమింగ్‌కు తగ్గటు​ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సరిగ్గా సరిపోయింది. సినిమాటోగ్రఫీ విషయంలో రామ్ రెడ్డి పనితీరు తెరపై కనిపిస్తుంది. రచయిత, దర్శకుడు స్క్రీన్‌ ప్లే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థం అయిపోతుంది. ఎడిటింగ్‌ విషయంలోనూ ఎడిటర్‌ పని తీరు చక్కగా తెలిసిపోతోంది.

బలాలు:

  •  నటీ,నటుల నటన.
  • ఎంగేజింగ్‌ కామెడీ.

బలహీనతలు:

  • పాత కథ

చివరి మాట: సామజవరగమన.. మీకు ఎంటర్‌టైన్‌మెంట్‌ పక్కా!
రేటింగ్: 3/5

Tags :

  • Movie News
  • movie review
  • Samajavaragamana
  • sri vishnu
Read Today's Latest reviewsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam