నేటి నుంచే ఈటెల పాదయాత్ర

మాజీ మంత్ర్రి ఈటెల రాజేందర్ తెరాస పార్టీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. గతంలో ఆయనపై భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తడంతో అధికార తెరాస పార్టీకి రాజీనామా చేశారు. దీంతో కావాలనే నాపై అవినీతి ఆరోపణలు సృష్టించారని అప్పట్లో ఈటెల పెద్ద ఎత్తున గొంతెత్తారు. ఇలా కొన్ని అనూహ్య పరిణామల మధ్య ఈటెల రాజేందర్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరి చివరికి భారతీయ జనతా పార్టీ చేరిపోయారు.

Etela Rajender Padayatra01 min ఇక అప్పటి నుంచే ఈటెల తన నియోజకవర్గమైన హుజురాబాద్ లో సమయమొచ్చినప్పుడల్లా పర్యటిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అయన తన పదవికి రాజీనామా చేయటంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.ఎన్నో ఏళ్ల నుంచి సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న నేతగా కొనసాగుతున్నారు ఈటెల రాజేందర్. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగ నుండటంతో ఇప్పటినుంచే పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి.

ఇక తాజాగా ఈటెల హుజురాబాద్ లో పాదయాత్ర చేయబోతున్నానంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆలస్యం కాకుండా నేటి నుంచి తన పాదయాత్ర మొదలపెట్టనున్నారు. ఇక సుదీర్ఘ ప్రజా దీవెన పేరుతో ఈ పాదయాత్ర కొనసాగనుంది. తాజాగా ట్విట్టర్ వేదికగా ఈటెల కొన్ని సూచనలు చేశాడు. ఆత్మగౌరవ ప్రస్థానానికి ఇదే తోలి అడుగు అని తెలిపారు. దీంతో ఈ పాదయాత్ర 28 రోజుల పాటు కొనసాకానుందని తెలుస్తోంది.