హుజురాబాద్ లో పోటీపై పెదవి విప్పిన కొండా సురేఖ

konda surekha

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా చేయటంతో హుజురాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఈ ఎన్నిక కోసం అన్ని పార్టీలు అప్పుడే గెలుపు గుర్రాలను రంగంలోకి దించాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి ఇప్పటికే అభ్యర్ధులను ఖారారు చేస్తూ.. కాస్త దూడును పెంచాయనే చెప్పాలి. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం అభ్యర్ధి పేరు ఇంకా ఫైనల్ కాలేదు. దీంతో కొత్త పీసీసీ అధ్యక్షుడు మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి అభ్యర్థి ఎవరనే చర్చల్లో ఇంకా తర్చనబర్జనలో ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో కొన్నాళ్ల నుంచి హుజురాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్ధిగా కొండా సురేఖ పేరు బలంగా వినిపిస్తోంది. ఈమె పేరు ఫైనల్ చేసినట్లు కూడా వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో మొట్టమొదటి సారిగా హుజురాబాద్ లో పోటీపై కొండా సురేఖ ఎట్టకేలకు పెదవి విప్పారు. పోటీపై స్పందించిన ఆమె.. టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి అభ్యర్ధులు పోటీలో ఉండటంతో పార్టీ నా పేరు ముందు ఉంచిందని, ఒకవేళ పోటీ చేసిన మళ్లీ వరంగల్ సీటుకే పరిమితమని హామీ ఇస్తేనే హుజుకాబాద్ లో పోటీ చేస్తానంటూ క్లారిటీ ఇచ్చారు. మరి కొండా సురేఖ అభ్యర్ధనను పార్టీ హైకమాండ్ స్వీకరిస్తారా? లేదంటే కాదంటరా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.