చిన్ని ఏనుగు పిల్లకు జడ్ ప్లస్ సెక్యూరిటీ.. వీడియో వైరల్

స్పెషల్ డెస్క్- ఒక్కోసారి జంతువులు భలే విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. అవి అలా ఎందకు అలా ప్రవర్తిస్తాయో ఎవ్వరికి అర్ధం కాదు. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జంతువులకు సంబందించిన ఎన్నో వీడియోలను మనం చూస్తున్నాం. కొన్ని వీడియోలైతే చాలా ఇంట్రస్టింగా, సరదాగా ఉంటాయి.

తాజాగా ఓ ఏనుగుల మందకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఏనుగుల మంద చిన్న ఏనుగు పిల్ల చుట్టూ సెక్యూరిటీ గార్డులుగా మారాయి. మరీ వివరించి చెప్పాలంటే వీఐపీలకు ఉండే జడ్ ప్లస్ సెక్యూరిటీని అందించినట్లు అనిపిస్తుంది. ఈ అరుదైన, అందమైన వీడియోను అటవీ శాఖకు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

elephants 1

ఏనుగుల మంద చిన్న ఏనుగు పిల్లకు జడ్ ప్లస్ సెక్యూరిటీని అందించడం చూడండి.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు ఆ అధికారి. నిజంగానే చిన్న ఏనుగు పిల్లకు, మిగతా ఎనుగులన్నీ కట్టు దిట్టమైన భద్రతను కల్పిస్తూ, రక్షణ వలయంగా మారాయని అనిపిస్తుంది. ఈ ఏనుగుల వీడియోను సోషల్ మీడియా నెటిజన్స్ బాగా ఇష్టపడుతున్నారు.

అంతే కాదు ఏనుగుల మందకు సంబందించిన వీడియో చూసిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కో కామెంట్ చేస్తున్నారు. తల్లిదండ్రులంతా ఇలాగే పిల్లలతో కలిసి నడవాలి.. అని ఒకరంటే, ఇది చాలా అందంగా ఉంది, ఈ వీడియో నా స్పెషల్ డేను చేసింది.. అని మరొకరు కామెంట్ చేశారు. చిన్న గణేషుడికి ఎంత సెక్యూరిటీనో అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు. నిజంగా భలే ముచ్చటేస్తుంది కదా ఈ ఎనుగుల మందను చూస్తోంటే.