ఇంట్లోకొచ్చిన కోబ్రా.. బుజ్జగించి బయటకి పంపిన మహిళ వీడియో వైరల్

Cobra in the house The woman who was sent out to appease - Suman TV

సాధారణంగా ఇంట్లోకి పాము వస్తే ఎవరన్నా ఎం చేస్తారు? భయంతో బయటికి పరుగు తీస్తారు. ఆ అరుపులకు చుట్టుపక్కల వాళ్లు వచ్చి గుమ్మిగూడుతారు. అందులో కాసింత ధైర్యం ఉన్నోళ్లు కర్ర పట్టుకుని చంపేందుకు చూస్తారు. మరి కొంతమంది సాహసవంతులు పామును పట్టి జనసంచారం లేని ప్రాంతాల్లో వదిలేస్తారు. కానీ వీటన్నీటికి భిన్నంగా కోయంబత్తూరులో జరిగింది.

Cobra in the house The woman who was sent out to appease - Suman TVఓ ఇంట్లోకి చిన్న కోబ్రా పాము వచ్చింది. ఆ ఇంట్లో నివాసముండే మహిళ ఏ మాత్రం జంకకుండా సొంత పిల్లలతో మాట్లాడుతున్నట్లు పాము మాట్లాడింది. చిన్న కర్రను చేత్తొ పట్టుకుని మారం చేసే పిల్లాడిని బడికి పంపినట్టు బుజ్జగిస్తూ బయటికి పంపింది. ఇప్పటికైతే బయటికి వెళ్లు మరోసారి వచ్చినప్పుడు పాలు పోస్తానులే అని చెప్పడం.. విని అర్థం చేసుకున్నట్టు గానే కోబ్రా బయటికి వెళ్లిన వీడియా నెట్లో వైరల్ అవుతోంది. చిన్న పామునైన పెద్ద కర్రతో కొట్టాలనేది సమేతే అయినా అందుకు భిన్నంగా జీవాలను చంపకుండా ఇలా బయటికి పంపడాన్ని నెటిజన్లు హర్షిస్తున్నారు.