ఈ మద్య ప్రతి చోట కల్తీ విక్రయాల జోరు బాగా పెరిగిపోయింది. ఎదుటి వారు ఏమైనా పరవాలేదు.. తమకు డబ్బే ముఖ్యం అనుకుంటున్నారు కేటుగాళ్లు. అయితే ఫుడ్ సెక్యూరిటీ ఎన్ని పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నా.. కల్తీ దందాలు మాత్రం సాగుతూనే ఉన్నాయి. కొన్ని షాపుల్లో కాలం చెల్లిన వాటికి కొత్త స్టిక్కర్లు అంటించి మరీ విక్రయిస్తుంటారు. వాటి వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం అని తెలిసినా కూడా తమ స్వార్థం తామే చూసుకుంటా షాపు యజమానులు.
తాజాగా మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని హెరిటేజ్ స్టోర్ లో బూజు పట్టిన బాదం మిల్క్ బాటిల్ విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు హెరిటేజ్ స్టార్. కాగా, బూజుపట్టిన బాదం మిల్క్ బాటిల్‌ను విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రామాయంపేటలోని హెరిటేజ్ స్టోర్‌ను శుక్రవారం రాత్రి మున్సిపల్ అధికారులు మూసివేయించారు. ఈ మద్య ఓ వినియోగదారుడు హెరిటేజ్ స్టోర్ లో బాదం మిల్క్ బాటిల్‌ను కొనుగోలు చేశాడు.
ఇంటికి వెళ్లి బాటిల్ మూత ఓపెన్ చేయగా దుర్వాసన వచ్చింది. ఈ విషయాన్ని వినియోగదారుడు మున్సిపల్ అధికారుల దృష్టికి తెచ్చాడు. విషయాన్ని వినియోగదారుడు మున్సిపల్ అధికారుల దృష్టికి తెచ్చాడు. వెంటనే ఆ బాటిల్ హైదరాబాద్ లోని ఫుడ్ ల్యాబ్ కి పంపించడం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో హెరిటేజ్ స్టాల్‌ను మూసివేయించారు. ఈ విషయంపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉదయ్‌కిరణ్ తెలిపారు.