అత్తాకోడళ్ల మధ్య గొడవలు ఉండటం అనేది సర్వసాధారణం. అలానే అత్తాకోడళ్లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటారు. అలానే ఒకరిపై మరొకరు అలుగుతుంటారు. తాజాగా ఓ అల్లుడు అత్తగారిపై అలిగి.. కరెంట్ స్తంభం ఎక్కాడు. అతడి డిమాండ్ ఏంటో తెలిస్తే మీరు షాకవుతారు.
అత్తాకోడళ్ల మధ్య గొడవలు ఉండటం అనేది సర్వసాధారణం. అలానే అత్తాకోడళ్లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఇద్దరు భౌతిక దాడికి దిగి.. ఓ రేంజ్ లో ఘర్షణ పడతారు. ఇక వారిని సముదాయించడం ఆ ఇంటి మగవాడికి తలకు మించిన భారంగా ఉంటుంది. ఇంకా దారుణం ఏమింటే అత్త, భర్త మీద అలిగిన కొందరు కోడళ్లు… తమ పుట్టింటికి వెళ్లిపోతారు. తన డిమాండ్లు నిరవేరుస్తేనే తిరిగి వస్తానని బెదిరిస్తుంటారు. అయితే తాజాగా ఓ వెరైటీ ఘటన చోటుచేసుకుంది. అత్తగారిపై అల్లుడు అలిగాడు. తనకు బంగారం పెట్టలేదని కరెంటు స్తంభం ఎక్కి తన భార్య కుటుంబాన్ని బెదిరించాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…
మెదక్ పట్టణంలోని గాంధీనగర్ లో శేఖర్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. శేఖర్ ఎలక్ర్టిషియన్ గా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శేఖర్ కొన్నేళ్ల క్రితం ఓ యువతిని ప్రేమించి.. ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన నాటి నుంచి శేఖర్ ముఖంలో ఎదో తెలియని అసహనం కనిపించిందంట. పెళ్లి సమయంలో తన అత్తగారు బంగారం పెట్టలేదంట. అయితే అత్తగారు బంగారం పెట్టలేదని అలిగిన శేఖర్ విద్యుత్ స్తంభం ఎక్కాడు. బంగారం పెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అతడు విద్యుత్ స్తంభం ఎక్కిన విషయాన్ని స్థానికులు గమనించి.. వెంటనే విద్యుత్ స్టేషన్ సిబ్బందికి ఫోన్ చేశారు. అప్రమత్తమైన విద్యుత్ స్టేషన్ సిబ్బంది కరెంటు సరఫరాను నిలిపివేశారు.
విషయం తెలుసుకున్న మార్కెట్ కమిటీ ఛైర్మన్ బట్టి జగపతి, డీఎస్పీ, సీఐ లు ఘటన స్థలానికి చేరుకున్నారు. తొలుతు శేఖర్ ను దిగాలని వారు విజ్ఞప్తి చేశారు. తన అత్తగారు బంగారం పెడితేనే కిందకి దిగుతానంటూ ఆ యువకుడు బెదిరించాడు. దీంతో బంగారం ఇప్పిస్తామని అక్కడ ఉన్న వారు హామీ ఇవ్వడంతో శేఖర్ దిగివచ్చాడు. శేఖర్ చేసిన పనిపై నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. భలే అల్లుడివి దొరికావని కొందరు అంటుంటే, అత్తగారి సొమ్ము కోసం అంత ఆశ ఎందుకు బాబు! అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. చివరకు ఏమవుతుందో చూడాలి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.