దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతి వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయిన అధికారులు అంటున్నారు.
దేశంలో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాల గురించి ప్రజల్లో ఎంతగా అవగాహన కల్పించినప్పటికీ.. కొంతమంది డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు చనిపోతున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినంగా పాటిస్తున్నా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ఇతర కారణాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ఓ కారు అదుపు తప్పి చిరువ్యాపారులపై దూసుకు వెళ్లిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన రాయంపేటలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
మెదక్ జిల్లా రాయంపేటలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు కథనం ప్రకారం.. మెదక్ జిల్లా లింగసానిపల్లికి చెందిన దుర్గా ప్రసాద్ తన కుటుంబ సభ్యులతో యాదగిరిగుట్టకు కారులో బయలుదేరాడు. కారును అతి వేగంగా నడుపుకుంటూ వస్తున్న నేపథ్యంలో రామాయంపేట బస్టాండ్ వద్దకు రాగానే అదుపు తప్పి పక్కనే పండ్లు అమ్ముకుంటున్న వారిపై దూసుకు వెళ్లింది. పండ్లు అమ్ముకుంటున్న మహిళ అక్కడిక్కడే చనిపోయింది. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలు కావడంతో 108 అంబులెన్సు లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతురాలు ఢి.ధర్మారం గ్రామానికి చెందిన పండ్ల వ్యాపారి రేణుక (55) గా గుర్తించారు. ఈ ఘటనలో గంగామణి, రింకు విశ్వకర్మ కు తీవ్రంగా గాయాలు కావడంతో వారిని మొదట పీహెచ్ సికి తరలించారు.. పట్టణానికి చెందిన జలమడుగు సత్యం అనే వ్యక్తి కాళ్లపై నుంచి కారు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి ప్రమాదంగా ఉండటంతో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అయితే కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. కారుని అత్యంత వేగంగా నడిపి మహిళ ప్రాణాలు బలితీసుకున్న దుర్గా ప్రసాద్ పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.