మటన్ కొంటే సోనూసూద్ కి డబ్బులు! కన్నయ్య మటన్ షాప్ స్పెషల్!

కష్టాల్లో ఉన్నప్పుడు మనకి ఎవరైనా సహాయం చేస్తే కృతజ్ఞతలు చెప్తాము. ఇలా ఓ 10 మందికి సహాయం చేసే వారిని మంచి వారు అంటాము. 100 మందికి సహాయం చేస్తే నాయకుడు అంటాము. వేల మందికి.. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సహాయం చేస్తుంటే కచ్చితంగా దేవుడు అంటాము. సోనూసూద్ ప్రస్తుతం దేశ ప్రజలకి ఇలానే కనిపిస్తున్నారు. కరోనా కాలం మొదలైన నాటి నుండి ఆయన ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నారు. ఇలా ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు కాబట్టే.., యావత్ దేశం సోనూసూద్ కి సెల్యూట్ చేస్తోంది. ఇదే సమయంలో సోనూ చేసే మంచి పనుల్లో భాగం అవ్వడానికి నేను సైతం.. అంటూ కొంత మంది ముందుకి వస్తున్నారు. తాజాగా తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లాలో కన్నయ్య అనే వ్యక్తికి మటన్ షాప్ ఉంది. కన్నయ్య కరోనా కలం మొదలైన నాటి నుండి సోనూసూద్ చేస్తున్న సహాయాలను చూస్తూ వస్తున్నాడు. వాటి గురించి వార్తల్లో వింటూనే ఉన్నాడు. అలాంటి మంచి పనుల్లో తాను భాగం కావాలి అనుకున్నాడు. వెంటనే కన్నయ్యకి ఓ ఐడియా వచ్చింది. తన మటన్ షాపు ఎదుట సోనూ సూద్ పేరిట ఓ బ్యానర్ పెట్టుకున్నాడు. అంతేకాదు అక్కడ ఓ ఆపర్ కూడా పెట్టాడు.

mut 2కిలో మటన్ 650 రూపాయలకే ఇవ్వడానికి ముందుకొచ్చాడు కన్నయ్య. నిజానికి మార్కెట్ లో కిలో మటన్ 700 రూపాయల పైనే ఉంది. కానీ.., కన్నయ్య రూ. 650 ఫిక్స్ చేశాడు. అందులో కూడా 600 రూపాయలు తాను తీసుకుని.., మిగతా 50 రూపాయలు సోనూసూద్ ఛారిటబుల్ ట్రస్ట్ కి అందజేస్తానని ఓ బ్యానర్ పెట్టేశాడు. కన్నయ్య ఆఫర్ లో అతని స్వార్థం ఏమి లేదు. పైగా.., అందులో ఓ మంచి ఉద్దేశం ఉంది. దీంతో.., కన్నయ్య మటన్ షాప్ ముందు జనం బారులు తీరారు. ఇలా కన్నయ్య మటన్ షాప్ కాస్త.. సోనూసూద్ మటన్ షాప్ అయిపోయింది. ఈ విషయం వైరల్ అయ్యి.., సోనూసూద్ వరకూ వెళ్లింది. దీంతో.., ఈ విషయంపై సోనూ స్పందించారు. నేను శాఖాహారిని. అయితే నాపేరున మాంసాహార దుకాణమా అంటూ చమత్కరించారు. మీ దుకాణానికి నేనేమైనా సహాయం చేయగలనా అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోనూ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. మరోవైపు కన్నయ్య కూడా నేను ఎలాంటి లాభం ఆశించి ఈ పని చేయడం లేదు. సోనూ సర్ చేస్తున్న మంచి పనికి అండగా నిలవాలి అనుకుంటున్నా అంతే అంటూ తన నిజాయతీని చాటుకున్నాడు. దీంతో.., కన్నయ్య మంచి మనసుకి అంతా ఫిదా అవుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.