మరిది పెళ్లిలో వదిన చేసిన డ్యాన్స్ కు అంతా ఫిదా

స్పెషల్ డెస్క్- ఈ మధ్య కాలంలో పెళ్లిల్లో డ్యాన్స్ ల ట్రెంట్ నడుస్తోంది. వాళ్లు వీళ్లు కాదు.. ఏకంగా పెళ్లి కూతుర్లే డ్యాన్స్ చేయడం బాగా పెరిగిపోయింది. మొన్నా మధ్య మంచిర్యాల్ పెళ్లి కూతురు నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా అంటూ పెళ్లి బారాత్ లో చేసిన డ్యాన్స్ సంచలనంగా మారింది. అదిగో అప్పటి నుంచి మొదలు చాలా పెళ్లిళ్లలో పెళ్లి కూతుర్లు డ్యాన్స్ చేయడం పరిపాటిగా మారింది.

ఇక పెళ్లిలో డ్యాన్స్‌ కు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. ఒకరిని చూసి ఒకరు వివాహమహోత్సవంలో డాన్స్‌ ప్రోగ్రాం కచ్చితంగా ఉండి తీరాల్సిందేనని పట్టు పడుతున్నారు. ఇంకేముంది ఇప్పుడు పెళ్లి అంటే డ్యాన్‌.. డ్యాన్స్‌ అంటే పెళ్లి అన్నట్లు మారిపోయింది పరిస్థితి. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, బంధువులు ఇలా ఎవరికి వారే తగ్గేదేలే అంటూ స్టెప్పులతో అదరగొడుతున్నారు.

Viral dance 1

ఇదిగో ఈ క్రమంలో మరిది పెళ్లిలో ఓ వదిన చేసిన డ్యాన్స్‌ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సుమారు 27 ఏళ్ల క్రితం సల్మాన్‌ ఖాన్, మాధూరి దీక్షిత్‌ జంటగా నటించిన.. హమ్‌ ఆప్‌ కే హైకోన్‌.. సినిమాలోని లోచలీ మై అప్‌ నీ దేవర్‌ కి బరాత్‌ లేకే.. అనే పాటకు వదిన తన స్టెప్పులతో అందరికి మతి పోగొట్టింది. తన మరిదికి పెళ్లి అయిన సంతోషంలో ఆమె ఆడి పాడింది. ఎల్లో, బ్లాక్‌ కలర్‌ ఫ్రాక్‌ ధరించిన ఆమె అద్భుతమైన డ్యాన్స్‌ తో అందరి చూపూ తనవైపే తిప్పుకుంది.

మధ్యలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకును స్టేజి మీదకు తీసుకొచ్చి డ్యాన్స్‌ చేయించేందుకు ప్రయత్నించింది . కానీ వారి కంటే వదిననే అదరగొట్టింది. మరిది పెళ్లిలో వదిన వేసిన స్టెప్స్ కు బంధువులు ఆమెపై నోట్ల వర్షం కురిపించారు. అయితే ఈ పెళ్లి ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలీదు కానీ, ఈ డ్యాన్స్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.