తెలంగాణ ఆర్టీసీలో సజ్జనార్ సార్ మార్క్. వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సజ్జనార్!

Sajjanar telangana hyderabad

సజ్జనార్.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నా అంకిత భావంతో పని చేయడం ఒక్కటే ఆయనకి తెలుసు. ఇక తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ డిపార్ట్మెంట్ లో సజ్జనార్ తీసుకొస్తున్న మార్పులు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ప్రజల్లో సంస్థ పట్ల నమ్మకం కలిగించి, ఆర్టీసీని లాభాల బాట పట్టించాలని సజ్జనార్ నిరంతరం కృషి చేస్తున్నారు. కానీ.., ఆర్టీసీలో జరిగే కొన్ని చిన్న చిన్న తప్పులు ప్రజలకి సంస్థపై నమ్మకాన్ని పోయేలా చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ విషయంలో సజ్జనార్ అధికారులను పరుగులు పెట్టించారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

తాజాగా ఒక ప్రయాణీకుడు ఎంజిబియస్ బస్టాండ్ లో తనకి కావాల్సిన ఆహార పదార్ధాలను కొనుగోలు చేశాడు. కానీ.., స్టాల్ యజమాని ఎమ్మార్ఫీ కంటే అధిక ధరకు ఆ పదార్ధాలను అమ్మాడు. ఇదేంటి అని ప్రశ్నించిన ప్రయాణికుడిపై దౌర్జన్యానికి దిగాడు. దీంతో.. స్టాల్ నిర్వాహకుడి ప్రవర్తనని తెలియజేస్తూ ట్విట్టర్ లో సజ్జనర్ కి ట్వీట్ చేశాడు ఆ ప్రయాణికుడు. ఆ సమయంలో తాను కొనుగోలు చేసిన రశీదుని కూడా ఆ ట్వీట్ కి జతపరిచాడు.

Sajjanar telangana hyderabad

ఈ ట్వీట్ కొద్దీ నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇలాంటి సంఘటనలు ఆర్టీసీలో చాలా మంది ప్రయాణికులకు ఎదురయ్యే ఉంటాయి కదా? వారంతా సదురు ప్రయాణికుడి ట్వీట్ ని షేర్లు కొట్టేశారు. అలా.. ఈ ట్వీట్ కాస్త సజ్జనార్ దృష్టికి వెళ్ళింది. దీంతో.. సజ్జనార్ తన టీమ్ ని వెంటనే సదురు స్టాల్ దగ్గరికి పరుగులు పెట్టించారు. మిగతా స్టాల్స్ లో కూడా ఇలాంటి తనికీలు చేశారు. ప్రయాణికుడిని ఇబ్బంది పెట్టి, ఎమ్మార్ఫీ కన్నా ఎక్కువ అమ్మిన స్టాల్ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేశారు.

ఇదే సమయంలో మహాత్మాగాంధీ బస్ స్టేషన్ లో కూడా అధికారులు తనికీలు నిర్వహించారు. అక్కడ కూడా అధిక ధరకు వస్తువు అమ్ముతున్న శ్రీ వెంటకటేశ్వర షాప్ నిర్వాహకుడికి వెయ్యి రూపాయల ఫైన్ ను విధించారు. అంతేకాదు మిగిలిన దుకాణదారులను హెచ్చరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ అయితే చర్యలు తప్పవని సజ్జనార్ అందరికి వార్నింగ్ ఇవ్వడం విశేషం.
దీంతో.. సజ్జనార్ టీఆర్టీసీలో తీసుకొస్తున్న మార్పులను చూసి, నెటిజన్లు ఠాగూర్ లో చిరంజీవి డైలాగ్ గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాదు సజ్జనార్ రియల్ ఠాగూర్ అంటూ కీర్తిస్తున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.