ఆర్టీసీ బస్సులో సజ్జనార్ ఫ్యామిలీ.. కుటుంబంతో కలిసి డ్యాన్స్

హైదరాబాద్- తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వీసీ సజ్జనార్‌ ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని మళ్లీ గాడిన పెట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేసిన సజ్జనార్, ఒక్కొక్కటిగా ఆచరణలో పెడుతున్నారు. అందులో భాగంగానే ఆర్టీసీ ప్రయాణం ఎంతో సురక్షితమైందని చెప్పేందుకు ఆయనే స్వయంగా ఆర్టీసీలో ప్రయాణించి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇప్పటి వరకు స్లోగన్స్ వరకే పరిమితం అయిన ఆర్టీసీ ప్రయాణం ఎంతో సురక్షితం అనే నినాదాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నారు సజ్జనార్. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని ప్రాయాణికులకు తెలియజేసేందుకు ఆయనే స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడమే కాదు, తన కుటుంబాన్ని మొత్తం ఆర్టీసీ బస్సెక్కించారు. తాజాగా సజ్జనార్‌ కు సంబంధించి ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

tsrtc Sjjanar 1

ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలసి ఎక్కడికో వెళ్తున్నారు. ఈ పర్యటన కోసం ఆయన ఆర్టీసీ బస్సును ఎంచుకున్నారు. బంధు మిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఇలా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు సజ్జనార్. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, సుఖమయం అంటూ ప్రచారాలకు మాత్రమే పరిమితం కాకుండా, స్వయంగా మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. మీరు గ్రేట్‌ సార్‌.. అంటూ నటిజెన్స్ కామెంట్‌ చేస్తున్నారు.

ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. దీనిలో సజ్జనార్‌ డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు. బస్సులో మ్యూజిక్‌ ప్లే అవుతుండగా అందరు చిన్నపాటి స్టెప్పులు వేశారు. అందరితో పాటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కూడా రెండు స్టెప్పులు వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సజ్జనార్ సార్ ఏంచేసినా కొత్తగానే ఉంటుందని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.