ఎన్టీఆర్, రాజమౌళి వాలీబాల్ ఆట- విడియో వైరల్

ఫిల్మ్ డెస్క్- ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. తారక్, రాంచరణ్ తో పాటు అజయ్ దేవగన్, ఆలియా భట్ తదతర భఆరీ తారాగణం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తోంది. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆగస్టు 1న ఉదయం 11 గంటలకు ఆర్ఆర్ఆర్ నుంచి దోస్తీ అనే మొదటి పాటను రిలీజ్ చేయబోతున్నారు. దీంతో అభిమానులంతా ఫస్ట్ సాంగ్ కోసం వెయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ కు సంబందించి తాజాగా ఆన్ లొకేషన్ నుంచి ఒక వీడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యింది.

NTR Playing Volleyball 1

ఈ వీడియోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి ఇద్దరూ ఇతర జట్టు సభ్యులతో వాలీబాల్ ఆడుతూ కనిపించారు. బిజీ షెడ్యూళ్ల నుంచి ఒత్తిడిని తొలగించుకునేందుకు కొంత విరామ సమయం వాలీబాల్ కి కేటాయించారు. మొత్తానికి ఆటలో జక్కన్న ప్రతిభ ఏంటో ఈ వీడియో చెప్పకనే చెబుతోంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరింకెందుకు ఆలస్యం.. మీరు ఈ విడియేను సూసెయ్యండి.