పబ్లిక్ టాయిలెట్ లో దర్జాగా సింహం.. వీడియో వైరల్!

ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చిత్ర విచిత్రమైన వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. గత రెండెళ్లుగా కరోనా మహమ్మారి ప్రజలను ఎంతగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ ఇబ్బందులు మనుషులకే కాదు.. జంతువులకు కూడా కలుగుతున్నాయి. అందుకే అడవుల్లో ఉండాల్సిన కృరమృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు గ్రామాల్లో చిరుత, ఎలుగుబంట్లు,పులులు.. సింహాలు కూడా వస్తున్నాయి.

sgig minతాజాగా ఓ సింహం పబ్లిక్ టాయిలెట్ నుంచి బయటకు రావడం చూసి అందరూ షాక్ తిన్నారు. పబ్లిక్ టాయిలెట్ నుంచి బయటికి వస్తున్న ఆ సింహం వీడియోను వైల్డ్ లెన్స్ ఈకో ఫౌండేషన్ అనే సంస్థ తమ ట్విట్టర్ అకౌంట్ లో వీడియో పోస్ట్ చేసింది. అయితే బాత్ రూమ్ లు అంతగా సేఫ్ కాదని.. ఎప్పుడూ మనుషులే ఉపయోగించుకుంటారా.. అప్పుడప్పుడు ఇలాంటి జంతువులు కూడా ఉపయోగించు కుంటాయి.. అంటూ క్యాప్షన్ పెట్టారు.

అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. అది మగ సింహం కాదు. ఆడ సింహం.. ఒక ఆడ సింహం అయి ఉండి.. జెంట్స్ టాయిలెట్ ను యూజ్ చేస్తోంది అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఆ సమయంలో అక్కడికి మనుషులు ఎవరూ వెళ్లకపోవడం మంచిదైందని.. లేదంటే ఎంత అనర్థం జరిగి ఉండేదో బాబో అని కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.