సింహాన్ని చూస్తేనే చాలా మంది జడుసుకుంటారు. అలాంటిది ఒక ఆవు కోసం తన ప్రాణాన్ని రిస్క్‌లో పెట్టి మరీ సింహంతో పోరాడాడో రైతు.
అడవికి రారాజైన సింహం కనిపిస్తే చాలు.. ఎవరైనా కిలో మీటర్ దూరం పరిగెత్తుతారు. సింహం అటాక్ చేయడం కాదు.. కనీసం మన వైపు చూసినా ప్రాణాలు అక్కడే ఆగిపోతాయి. కానీ అలాంటి సింహంతో ఒక అన్నదాత పోరాటానికి దిగాడు. ఆవును చంపేందుకు ప్రయత్నిస్తున్న సింహాన్ని అడ్డుకున్నాడు. ఆవును రక్షించేందుకు తన ప్రాణాలు అడ్డుపెట్టాడా రైతు. మొత్తానికి ఎలాగోలా ఆవును కాపాడాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని గిర్ సోమ్‌నాథ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ రైతుకు చెందిన ఆవు మీద ఒక ఆడ సింహం అటాక్ చేసింది. ఆవు మెడను తన నోటితో గట్టిగా పట్టుకుంది సింహం.
ఆవును తన నోటితో పట్టుకొని రోడ్డు మీదకు ఈడ్చుకెళ్లిందా ఆడ సింహం. అయితే సింహం బారి నుంచి తప్పించుకునేందుకు ఆవు తెగ పెనుగులాడుతూ తీవ్రంగా ప్రయత్నించింది. కానీ సింహం దాన్ని వదల్లేదు. దీంతో కొంతదూరంలో ఉన్న రైతు తన ఆవును కాపాడుకునేందుకు ధైర్యంగా ముందుకు వచ్చాడు. తన ప్రాణాలకు రిస్క్ ఉన్నా భయపడలేదు. రోడ్డుపై ఉన్న రాళ్లను సింహం మీదకు విసిరాడు. గట్టిగా అరిచి దాన్ని బెదరగొట్టేందుకు ప్రయత్నించాడు. ఆఖరికి బెదిరిన సింహం తన పట్టును సడలించి అడవిలోకి పారిపోయింది. ఆ టైమ్‌లో రోడ్డుకు మరోవైపు నిలిచిన ఒక కారులోని వ్యక్తి ఈ ఘటనను తన ఫోన్లో రికార్డ్ చేశాడు. సింహాన్ని రైతు బెదరగొడుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ગીર સોમનાથ જિલ્લાના આલીદર ગામે સિંહણ દ્વારા ગાય ઉપર હુમલો કરેલ ત્યારે ખેડૂતે #Credit કિરીટસિંહ ચૌહાણ પોતાની ગાયને એક ખમીરવંતો પ્રયાસ કરેલ અને સફળતા મળેલ.
ખુબ ખુબ સલામ#lion #animalattack #cow #lioness #kingofthejungle #hunt #wildlife #india #nationalgeographic #discovery pic.twitter.com/lDYGub9bfZ— Vivek Kotadiya🇮🇳 BJP (@VivekKotdiya) June 29, 2023