Taj Mahal: తాజ్ మహల్ లో మూసి ఉన్న 22 గదుల్లో ఏమున్నాయంటే!

Taj Mahal

ప్రపంచంలో లో ఉన్న ఏడు వింతల్లో తాజ్ మహల్ ఒకటి. ఈ అందమైన కట్టడం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. తాజ్ మహల్ కేవలం సౌందర్యానికి ప్రతీకగానే కాక, అమూల్యమైన ప్రేమ చిహ్నంగా మిగిలిపోయింది. తాజ్ మహల్ ను మొఘల్ చక్రవర్తి షాజహాన్, తన భార్య ముంతాజ్ జ్ఞాపక చిహ్నంగా కట్టించాడు. ఇటీవల తాజ్ మహల్ లోని మూసి గదుల రహ్యసాల గురించి పెద్ద చర్చ నడుస్తుంది. అయితే ఆ గదులకు సంబంధించిన విషయాలను తాజ్ మెజిస్టీరియల్ స్టడీ రచయిత ఎబ్బా కోచ్ తెలిపారు.

తాజ్‌మహల్‌లో శాశ్వతంగా మూసి ఉంచిన 22కి పైగా గదులను తెరిచి అందులోని వాస్తవ చరిత్రను పరిశోధించాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి పిటిషన్‌ను దాఖలు చేశారు. మూసి ఉన్న ఆ గదుల్లో హిందువుల దేవుడు శివుడి సంబంధించిన ఆలయం ఉందని చరిత్రకారులు, ఆరాధకులు చేస్తున్న వాదనల్లోని నిజానిజాలను తాను తెలుసుకోవాలనుకుంటున్నట్లు పిటిషనర్ రజనీశ్ సింగ్ తెలిపాడు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియాతో దీనిపై నివేదిక ఇప్పించాలని కోరాడు. అయితే.. పిటిషనర్ అభ్యర్థనను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. రజనీశ్ సింగ్ తెరవాలని కోరుతున్న చాలా గదులు తాజ్‌మహల్ బేస్‌మెంట్‌లో ఉన్నాయి.

Taj Mahal

అయితే, ఆ గదుల్లో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు అని అధికారులు అంటున్నారు. అయితే మొఘల్ ఆర్కిటెక్చర్ పరిశోధకురాలు ఎబ్బాకోచ్ .. తన పరిశోధన సందర్భాంగా తాజ్ మహల్ లోని గదులను, దారులను సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ మూసి ఉన్న గదులకు సంబంధించిన పలు అంశాలను ఆమె గుర్తించారు. ఆమె పరిశోధనల ప్రకారం.. తాజ్ మహల్ లోని ఆ గదులు, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే వేసవి నెలల కోసం భూగర్భంలో నిర్మించినవి. నదీతీరం వైపు ఉన్న తాజ్‌మహల్ గ్యాలరీలో వరుసగా గదులు ఉంటాయి. నదీతీరం వెంబడి 15 గదులు వరుసగా ఉన్నాయి. ఆ గదుల వెళ్లే దారి ఇరుకుగా ఉన్నాయి. అందులో ఏడు గదులు పెద్దగా, నలువైపులా గూళ్లతో ఉండగా.. ఆరు గదులు చతురస్రాకారంలో, మరో రెండు గదులు అష్టభుజి ఆకారంలో ఉన్నాయి.

Taj Mahal

పెద్దగా ఉండే గదుల ముఖద్వారం నదీతీరం వైపు ఉంటుంది. ఆ గదుల్లో అందమైన పేయింటింగ్‌లు, అలంకరణలు, నక్షత్రాల జాలీలు ఉన్నాయి. “చక్రవర్తి, ఆయన రాణులు ఉల్లాసంగా గడపడానికి ఇది ఒక చల్లని, అందమైన ప్రదేశంగా ఉండి ఉంటుంది.మొఘల్ వాస్తు కళలో ఇలాంటి భూగర్భ గ్యాలరీలు ఉండటం సర్వ సాధారణం. పాకిస్తాన్‌లోని లాహోర్ నగరంలో ఉన్న ఒక మొఘల్ కోటలో కూడా ఇటువంటి గదులు ఉన్నాయి”అని ఎబ్బా కోచ్ తెలిపారు.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.