దారుణం.. చెన్నైలో నిర్భయ తరహా ఘటన

దేశంలో ఈ మద్య మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెచ్చుమీరుతున్నాయి. కామాంధులు ఆడది కనిపిస్తే చాలు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మృగంలా చెచ్చిపోతున్నారు. తాజా తమిళనాడు లో దారుణం చోటు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ తరహా దారుణమే తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది.

ఓ యువతిని పథకం ప్రకారం కిడ్నాప్ చేసిన ఐదుగురు యువకులు కారులో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. చెన్నై దగ్గరలోని కాంచీపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెల్ ఫోన్ షాపులో పని చేస్తున్న ఓ 20 ఏళ్ల యువతికి గుణ శీలన్ అనే వ్యక్తి తో పరిచయం ఏర్పడింది. అయితే ఆ పరిచయంతోనే గుణ శీలన్ యువతికి కూల్ డ్రింక్ ఇవ్వగా అతడిని నమ్మి కూల్ డ్రింక్ తాగింది. అప్పటికే ఆ కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపాడు గుణ.

A Lecturer sexually Harassing the Girl Student - Suman TVయువతి స్పృహ తప్పి పడిపోవడం తో గునశీలన్ అతనితో పాటు మరో ఐదుగురు కలిసి యువతిని కారులో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. కారును రోడ్డుపై పోనిస్తూ ఈ దుర్మార్గులు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతికి స్పృహ వచ్చి తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని గుర్తించింది. దీంతో గట్టిగా కేకలు వేయగా బయపడిపోయిన దుండగులు రోడ్డుపైనే యువతిని పడేసి పరారయ్యారు. రోడ్డు పై అర్థనగ్నం పడి ఉన్న యువతిని అటుగా వెళ్తున్న ప్రయాణికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.