ఏపీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్ అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన ఇంటి గోడను కూల్చడానికి రెవెన్యూ అధికారులు రావడంతో.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయ్యన్న పాత్రుడు ఇంటి గోడను అధికారులు బుల్డోజర్‌తో కూల్చేశారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటి వద్ద ఆదివారం తెల్లవారుజాము నుంచి తీవ్ర ఉద్రిక్తత, భారీ ఎత్తున పోలీసు బలగాల మోహరింపు కొనసాగుతున్నది. అయ్యన్నపై నిర్భయ చట్టంతోపాటు మరో 12 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఆయనను ఏ క్షణమైనా అరెస్టు చేయొచ్చని సమాచారం. వివరాలివే..
మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటిని ఆదివారం తెల్లవారుజామున పోలీసులు చుట్టుముట్టారు. నర్సీపట్నంలో అయ్యన్నను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. చోడవరం మినీ మహానాడులో సీఎం జగన్‌పై, మంత్రి ఆర్కే రోజాపై అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన ఫలితంగానే తాజా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Harassment Of Woman: మహిళా మంత్రి అశ్లీల వీడియోకు ప్రయత్నం.. వ్యక్తి అరెస్ట్!
అనుచిత వ్యాఖ్యలతోపాటు స్థలం ఆక్రమణ వ్యవహారంలోనూ అయ్యన్నకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు, మున్సిపల్ అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. అయ్యన్న ఇంటి వెనకాల గోడను బుల్డోజర్ (జేసీబీ)తో కూల్చివేశారు. పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని.. ప్రభుత్వ భూమిలోని రెండు సెంట్లు ఆక్రమించారని నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ నోటీసులో పేర్కొన్నారు. గోడ కూల్చివేతపై అయ్యన్న కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారమే ఇంటి గోడ ఉందని, దానిని అక్రమమంటూ కూల్చేయడం అన్యాయమని అయ్యన్న కొడుకు రాజేశ్ మీడియాకు తెలిపారు.
ఇది కూడా చదవండి: Bank Loan: రూ.6కోట్లు లోన్ అడిగిన రైతు.. అతడు చెప్పిన కారణం విని నోరెళ్లబెట్టిన అధికారులు!
ల్యాండ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాతే గోడను నిర్మించామన్న అయ్యన్న కుటుంబీకులు.. పోలీసులు ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేశారని ఆరోపించారు. అయితే, అధికారులు మాత్రం ప్రభుత్వ స్థలంలో గోడను నిర్మించినందుకే కూల్చేసినట్టు చెబుతున్నారు. అయ్యన్నఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయన కుమారుడు రాజేశ్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులు, అయ్యన్న కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వివాదం జరిగి స్వల్ప తోపులాట కూడా చోటుచేసుకుంది. ఇక ఏ క్షణమైన అయ్యన్నను అరెస్ట్ చేస్తారనే ప్రచారం చోరుగా సాగుతోంది. మరి దీనిపై అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తె లియజేయండి.
ఇది కూడా చదవండి: Mens Monday: స్టార్ హీరోయిన్ పోస్టర్ తో రెస్టారెంట్.. పురుషులకు మాత్రమే 25% ప్రత్యేక డిస్కౌంట్!