2012లో దేశరాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మన రాష్ట్రంలో దిశ, 6 ఏళ్ల చిన్నారి హత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిపై పెద్ద ఎత్తున జనాగ్రహం వ్యక్తం అవుతున్నా, దుర్మార్గులను పలు విధాలుగా శిక్షిస్తున్నా మహిళలపై మానవమృగాలు జరిపే దారుణాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. తాజాగా బస్సులో ప్రయాణిస్తున్న యువతిని డ్రైవర్, కండక్టరే అత్యంత ఘోరంగా అత్యాచారం చేసి బస్సుల్లోంచి విసిరేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాలు.. బాధితురాలిది మీరట్ జిల్లా సర్ధనా పట్టణం. శుక్రవారం రాత్రి ఢిల్లీ వెళ్లేందుకు భైసాలి బస్టాప్‌లో ఆమె బస్సు ఎక్కింది.
కొద్దిసేపటికే బస్సులోని కొద్దిమంది దిగిపోయారు. ఒంటరిగా ఉన్న మహిళతో మాటలు కలిపిన డ్రైవర్, కండక్టర్ ఆమెకు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ను ఆఫర్ చేశారు. అది తాగిన కొద్దిసేపటికే ఆమె స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమెపై ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లవార్లూ ఒకరి తర్వాత ఒకరు తమ దాష్టీకాన్ని కొనసాగించారు. శనివారం తెల్లవారుజామున మీరట్‌లో ఓ చోట ఒళ్లంతా గాయాలతో స్పృహ కోల్పోయిన స్థితిలో బాధితురాలిని పోలీసులు గుర్తించారు. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు సాగుతోంది.
ఇదీ చదవండి: ఫ్రెండ్ రూమ్ లో ఆమెతో కోరిక తీర్చుకుని.. పోలీస్ జాబ్ వచ్చాక హ్యాండ్ ఇచ్చాడు!