రోజులు మారుతున్నాయి.. రోజులతో పాటు మనుషుల ఆలోచనలూ మారుతున్నాయి. కానీ ఈ మారుతున్న ఆలోచనలతో పాటే మన కట్టుబాట్లు.. ఆచారసాంప్రదాయాలు కూడా మారుతున్నాయి. ఇంతకు ముందు ఇలాంటి వార్తలు విదేశాల్లో మాత్రమే మనం వినేవాళ్లం.. చూసేవాళ్లం. ఆ వార్త విన్నప్పుడు, చూసినప్పుడు చీ ఇదే పాడు బుద్ది అనుకోవడం సహజమే. ఇంతకీ ఆ వార్త ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుత ఆధునిక కాలంలో ఇలాంటివి అన్నీ సహజమే అని ఇంతకు ముందే కొన్ని వివాహాలు చాటి చెప్పాయి. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
సుబిక్ష సుబ్రమణి.. తమిళ బ్రాహ్మణ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. టీనా దాస్ బంగ్లాదేశ్ కు చెందిన కన్జర్వేటివ్ హిందూ కుటుంబానికి చెందిన మరో అమ్మాయి. వీరిద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు దగ్గరగా ఉండటంతో వీరి మధ్య స్నేహం మెుదలైంది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. కానీ ఈ విరుద్దమైన ప్రేమను మన సమాజంలో ఒప్పుకుంటారో లేదో అని ఆరేళ్లుగా తమలో తామే మదన పడ్డారు. కానీ చివరికి వీరి ప్రేమను వారి కుటుంబాల్లో ఒప్పుకున్నారు. తమిళనాడులోని చెన్నైలో ఇరు కుటుంబాల సమక్షంలో బ్రాహ్మణ ఆచారంలో ఘనంగా వీరి వివాహం జరిగింది. ఈ పెళ్లికి బంధు మిత్రులు కూడా హాజరుకావడం విశేషం.
చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న సుబ్రమణి తాను బైసెక్సువల్ అని అంగీకరించింది. ఇక ఈ పెళ్లి గురించి సుబిక్ష మాట్లాడుతూ.. మేం పుట్టింది ఇక్కడే అయినప్పటికీ కొన్ని రోజులు ఖతార్ లో నివసించాం. ప్రస్తుతం కెనడాలో ఉంటున్నాం. ఇక్కడే మాకు LGBT కమ్యూనిటీ గురించి తెలిసింది. అప్పుడే మా కూతురు తన ప్రేమ విషయం చెప్పింది. ఈ విషయం తెలియగానే నాకు చాలా భయం వేసింది. మా బంధువులు, స్నేహితులు ఏమనుకుంటారో అని. అయినప్పటికీ ఈ పెళ్లికి మేం అంగీకరించాం. టీనా దాస్ మాట్లాడుతూ.. LGBT కమ్యూనిటీ గురించి అవగహన లేక మా తల్లిదండ్రులు నన్ను అర్దం చేసుకోలేదు.
పైగా నాకు ఏదో సమస్య ఉందనుకున్నారు. పెళ్లి చేస్తే అన్నీ సర్ధుకుంటాయని నా తల్లిదండ్రులు అనుకున్నారు. దాంతో నాకు 19 ఏళ్ల వయసులోనే వివాహం చేశారు. కానీ నేను ఆ వైవాహిక జీవితంలో ఆనందంగా జీవించలేక పోయాను. దాంతో 4 సంవత్సరాల తర్వాత అతడికి విడాలు ఇచ్చాను. తర్వాత సుబిక్షను కల్గేరీలోనే మెుదటి సారి కలిశాను. ఇప్పటికి తాము ఒక్కటి అవ్వడం చాలా సంతోషంగా ఉందని టీనా దాస్ తెలిపింది. ప్రస్తుతం వీరి వివాహ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తమిళనాడు అమ్మాయి.. బంగ్లాదేశ్ అమ్మాయి ఒక్కటి కావడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.